AP News:భార్యబిడ్డలను చంపి కానిస్టేబుల్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..

ABN , First Publish Date - 2023-10-05T10:41:28+05:30 IST

నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వెంకటేశ్వరులు అనే కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీ కాల్చి చంపేశాడు.

AP News:భార్యబిడ్డలను చంపి కానిస్టేబుల్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..

కడప: నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వెంకటేశ్వరులు అనే కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీ కాల్చి చంపేశాడు. ఆపై వెంకటేశ్వరులు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప నగరంలోని టుటౌన్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు రైటర్‌గా పనిచేస్తున్నాడు. పోలీస్ స్టేషన్ నుంచి ఒక తుపాకీని తన వెంట తెచ్చుకున్న వెంకటేశ్వర్లు.. ఇంటికి వచ్చాక భార్యాబిడ్డలను చంపడమే కాకుండా.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య తరచూ గొడవులు జరుగుతూ ఉండేవని స్థానికులు చెబుతున్నారు. అప్పులు, ఆర్ధిక సమస్యల వల్ల కుటుంబ కలహాలున్నట్లు బంధువులు వెల్లడించారు.


ఇదిలా ఉంటే.. ఆత్మహత్య చేసుకునే ముందు ఎస్పీ సిద్దార్ధ కౌశల్‌కు(SP Siddharth Kaushal) మృతుడు వెంకటేశ్వర్లు సూసైడ్ నోట్ రాశాడు. అయితే సూసైడ్ నోట్‌లో మాత్రం కాల్పుల సంఘటన, ఆత్మహత్యకు గల కారణాలు తెలుపలేదు. కేవలం తన మరణానంతరం తనకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ తన రెండవ భార్య రమాదేవి కుటుంబానికి చెందేలా చూడాలని సూసైడ్ నోట్‌లో ఎస్పీకి విన్నవించాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-10-05T11:13:56+05:30 IST