Viveka Case: సాక్షిగా షర్మిల వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించిన సీబీఐ
ABN , First Publish Date - 2023-07-21T14:31:16+05:30 IST
మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో (Viveka Murder Case) సాక్షిగా గతేడాది అక్టోబర్ 7న వైస్ షర్మిల (YS Sharmila) సీబీఐ (CBI)కి వాంగ్మూలం (Testimony) ఇచ్చారు. ఈ కేసులో కేసులో 259వ సాక్షిగా షర్మిల వాంగ్మూలాన్ని సీబీఐ కోర్టులో సమర్పించింది.
హైదరాబాద్: మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో (Viveka Murder Case) సాక్షిగా గతేడాది అక్టోబర్ 7న వైస్ షర్మిల (YS Sharmila) సీబీఐ (CBI)కి వాంగ్మూలం (Testimony) ఇచ్చారు. ఈ కేసులో కేసులో 259వ సాక్షిగా షర్మిల వాంగ్మూలాన్ని సీబీఐ కోర్టులో సమర్పించింది.
‘‘నా వద్ద ఆధారాలు లేవు కానీ.. రాజకీయ కోణంలోనే ఈ హత్య జరిగింది.. ఈ హత్యకు కుటుంబం ఆర్థిక అంశాలు కారణం కాదు.. పెద్ద కారణమే ఉంది.. అవినాష్ కుటుంబానికి.. వివేకా వ్యతిరేకంగా ఉండడమే హత్యకి కారణం కావచ్చు.. వారి దారికి వివేకా అడ్డొస్తున్నాడని హత్య చేసి ఉండవచ్చు.. హత్యకు కొన్ని నెలలు ముందే వివేకా బెంగళూరులో మా ఇంటికి వచ్చారు. కడప ఎంపీగా పోటీ చేయాలని మా చిన్నాన్న వివేకా నన్ను అడిగారు. ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేయవద్దని వివేకా కోరుకున్నారు. అవినాష్‌కు ఎంపీ టికెట్ రాకుండా జగన్ మోహన్ రెడ్డిని ఒప్పిద్దామని నాతో చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్‌కు వ్యతిరేకంగా నేను వెళ్ళనని నాతో మా చిన్నాన్న చెప్పారు. ఈ విషయంలో జగన్‌ను కచ్చితంగా ఒప్పించగలనని వివేక నాతో చర్చించారు.. తనపై బాబాయ్ పదేపదే ఒత్తిడి తీసుకురావడంతో ఏమి చేయలేక సరే అన్నాను..’’ అంటూ షర్మిల స్టేట్‌మెంట్ ఇచ్చారు.
ఎంపీగా వివేక పోటీ చేయాలని భావించకుండా మీపై ఎందుకు ఒత్తిడి తీసుకువచ్చారని సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. అప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేక ఓడిపోవడంతో ఎంపీగా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు షర్మిల చెప్పారు. తల్లి విజయలక్ష్మిపై వివేక పోటీ చేసిన తర్వాత కొంత దూరంగా ఉన్నారని చెప్పారు. ఆ కారణంతోనే తనకు టికెట్ దొరకపోవచ్చుని వివేక భావించి ఉండవచ్చునని షర్మిల అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో వివేక ఓటమికి దగ్గరగా ఉన్న వ్యక్తులే కారణమని తాను స్పష్టంగా చెప్పగలనన్నారు. కుటుంబంలో అందరం బాగున్నట్లు బయటికి కనిపించిన లోపల కోల్డ్ వార్ నడిచేదని షర్మిల సీబీఐకు వాంగ్మూలమిచ్చారు.