Viveka Case : గంగిరెడ్డికి బెయిల్ రద్దుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీజేఐ
ABN , First Publish Date - 2023-05-18T13:16:48+05:30 IST
వివేకా హత్య కేసు నిందితుడు గంగి రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై సీజేఐ చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెయిల్‌ను రద్దు చేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి పరిశీలించారు. ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను వెకేషన్ బెంచ్‌కి బదిలీ చేసింది. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ వచ్చేవారం విచారణ జరపనుంది.
ఢిల్లీ : వివేకా హత్య కేసు నిందితుడు గంగి రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై సీజేఐ చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెయిల్‌ను రద్దు చేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి పరిశీలించారు. ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను వెకేషన్ బెంచ్‌కి బదిలీ చేసింది. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ వచ్చేవారం విచారణ జరపనుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వుల్లో షరతును సవాలు చేస్తూ సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సునీత పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ విషయమై వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ గత నెల 27న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, జూన్ 30లోగా దర్యాప్తును పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించిన నేపథ్యంలో....జూలై 1న గంగిరెడ్డిని బెయిల్‌పై విడుదల చేయాలని తన ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది. దీన్ని వ్యతిరేకిస్తూ సునీతారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. డీఫాల్ట్ బెయిల్‌పై బయట ఉన్నప్పుడు గంగిరెడ్డి తనకు కోర్టు ఇచ్చిన వెసులుబాటును దుర్వినియోగం చేసిన ఉదంతాలు ఉన్నాయని తన పిటిషన్‌లో ఆమె పేర్కొన్నట్లు సమాచారం.