Chandrababu live updates: సుప్రీంలో విచారణ రేపటికి వాయిదా.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్లు కొట్టివేత..

ABN , First Publish Date - 2023-10-09T11:27:25+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుకు (Nara Chandrababu Naidu) సోమవారం బెయిల్‌ (Bail) వస్తుందా?.. రాదా అనే ఉత్కంఠకు తెరపడింది. చంద్రబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్ట్ కొట్టివేసింది. సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కూాడా తోసిపుచ్చింది. కాగా ఈ రోజు ఉదయం ఏపీ హైకోర్టులో కూడా చంద్రబాబుకు నిరాశే ఎదురైంది. అంగళ్లు అల్లర్లు, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్ట్ కొట్టివేసిన విషయం తెలిసిందే.

Chandrababu live updates: సుప్రీంలో విచారణ రేపటికి వాయిదా.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్లు కొట్టివేత..

Live News & Update

  • 2023-10-09T17:33:00+05:30

    క్వాష్ పిటిషన్‌పై సుప్రీం విచారణ రేపటికి వాయిదా..

    • సుప్రీంకోర్టులో చంద్రబాబు ఎస్ఎల్‌పీపై నేటి (సోమవారం) వాదనలు ముగిశాయి.

    • సోమవారం చంద్రబాబు తరపున న్యాయవాది హరీష్ సాల్వే రెండున్నర గంటలకుపైగా వాదనలు వినిపించారు.

    • చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపు కూడా విచారణ కొనసాగనుంది.

    • సోమవారమంతా చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన హరీష్ సాల్వే.

    • రేపు వాదనలు వినిపించనున్న ప్రభుత్వ తరపు లాయర్ ముకుల్ రోహిత్గీ

  • 2023-10-09T16:05:00+05:30

    సుప్రీంకోర్టులో రేపు కూడా విచారణ..

    చంద్రబాబు ఎస్‌ఎల్‌పీపై (SLP) సుప్రీంకోర్ట్‌లో వాదనలు కొనసాగుతున్నాయి. గత రెండు గంటలుగా హరిష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపు కూడా విచారణ కొనసాగనుంది. ఈ రోజంతా (సోమవారం) చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తుండగా.. ప్రభుత్వం తరపున రేపు వాదించబోతున్నారు. దీంతో ప్రభుత్వ తరపు లాయర్ ముకుల్ రోహిత్గి కోర్ట్ నుంచి నిష్క్రమించారు.

    Untitled-12.jpg

  • 2023-10-09T15:59:00+05:30

    • చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉన్న పీటీ వారెంట్లపై విచారణ ప్రారంభం.

    • పీటీ వారెంట్లపై వాదనలు అవసరం లేదని, కోర్టు నిర్ణయం తీసుకుంటే చాలంటూ సీఐడీ న్యాయవాది వివేకా వాదనలు.

    • పీటీ వారెంట్లపై వాదనలు వినిపించేందుకు అవకాశం ఉందంటూ జడ్జికి వివరించిన చంద్రబాబు తరపు న్యాయవాదులు పోసాని, గింజుపల్లి.

    • పీటీ వారెంట్లపై వాదనలు వినిపిస్తున్న పోసాని.

    • ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో చంద్రబాబుపై పెండింగులో ఉన్న పీటీ వారెంట్లు.

  • 2023-10-09T15:53:00+05:30

    • చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుధీర్ఘంగా కొనసాగుతున్న వాదనలు.

    • చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది హరీష్ సాల్వే.

  • 2023-10-09T15:28:00+05:30

    • ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకు ప్రతికూల తీర్పు

    • బెయిల్, కస్టడీ పిటీషన్‌లను కొట్టేసిన న్యాయమూర్తి

    • సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను తోసిపుచ్చింది

  • 2023-10-09T15:23:00+05:30

    • చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై ఏసీబీ కోర్టులో మరికాసేపట్లో తీర్పు

    • లంచ్ అనంతరం బెంచ్‌పైకి వచ్చిన న్యాయమూర్తి

  • 2023-10-09T15:03:00+05:30

    17ఏ వర్తిస్తుందా.. లేదా..?

    • సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న హరీష్ సాల్వే

    • 17ఏ డేట్‌ ఆఫ్‌ ఎఫ్‌ఐఆర్‌ వర్తిస్తుందా..? లేదా..? డేట్‌ ఆఫ్‌ అఫెన్స్‌ కింద వర్తిస్తుందా..? అనేది కోర్టు ముందుంచాం

    • నేరుగా నగదు తీసుకుంటూ పట్టుబడితే తప్ప మిగిలిన అన్నింటికి 17ఏ వర్తిస్తుంది

    • ఈ కేసులో ఫిర్యాదును చూస్తే సీమెన్స్‌, డిజైన్‌టెక్‌, ఇతరుల పేర్లున్నాయే తప్ప పిటిషనర్‌ పేరు లేదు

    • పైగా ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు 2021 తర్వాత జరిగిందని భావించాలి.. అందువల్ల 17A సవరణ ఈ కేసుకు వర్తిస్తుంది

    • ఇప్పుడు మీరు మళ్లీ హైకోర్టుకు వెళ్లి వాదన వినిపించమంటే మేం నష్టపోతాం

    • హైకోర్టు కచ్చితంగా సెక్షన్‌ 17A సవరణ దీనికి వర్తించదంటారు..

    • ఒక డాక్యుమెంట్‌ కారణంగా తీర్పు మారకూడదు

    • నేను మీకు ఈ డాక్యుమెంట్‌ గురించి ఎందుకు చెప్పానంటే.. దీని వల్లే CID వారు దర్యాప్తును 2018 కంటే ముందు ప్రారంభించామంటున్నారు

    • హైకోర్టు ఏమంటుందంటే.. ప్యారా 15 ప్రకారం నేరం 2015-16 మధ్య జరిగిందని చెబుతోంది

    • వారి దృష్టిలో దర్యాప్తు తేదీకి ఎలాంటి సంబంధం లేదు.. ఎందుకంటే ఏపీ హైకోర్టు అసలు డాక్యుమెంట్‌నే పరిగణనలోకి తీసుకోలేదు : సాల్వే

    CBN-And-Salve.jpg

  • 2023-10-09T14:55:00+05:30

    విచారణ ఎప్పుడు ప్రారంభమైంది..?

    • చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో లంచ్ బ్రేక్ తర్వాత మొదలైన వాదనలు

    • ఏపీ సర్కార్‌ తరపున లాయర్‌ ముకుల్‌ రోహత్గి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు

    • చంద్రబాబు తరపున న్యాయవాది హరీష్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా, సింఘ్వీ వాదనలు

    • చంద్రబాబు కేసులో విచారణ ఎప్పుడు ప్రారంభమైందని ప్రశ్నించిన సుప్రీం జడ్జి

    • 2021 డిసెంబర్‌లో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారన్న సాల్వే

    • 2017లోనే కేసు దర్యాప్తు ప్రారంభమైందనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్న సాల్వే

    • 17A కింద గవర్నర్‌ అనుమతి తీసుకున్నాకే అరెస్ట్‌ చేయాలి..

    • 17A విధివిధానాలను కోర్టుకు వివరించిన లాయర్‌ సాల్వే

    • 2018 తర్వాత ఫిర్యాదు ఆధారంగా 2021లో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు

    • 2017లో విచారణకు సంబంధించిన ఏ అంశాలను కూడా..

    • 2021 ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదంటూ హరీష్‌ సాల్వే వాదనలు

    supreme-(2).jpg

  • 2023-10-09T14:35:00+05:30

    అటు తీర్పు.. ఇటు పిటిషన్

    • ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మరో పిటీషన్ దాఖలు చేసిన సీఐడీ

    • కేసులో కొత్తగా మరో నలుగురిని నిందితులుగా చేర్చిన అధికారులు

    • మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీల, ఆవుల మణి శంకర్, రాపూరి సాంబశివరావు లను నిందితులుగా చేర్చిన సీఐడీ

    • నిందితులపై ఐపీసీ-120బి, 409, 420, 34,35 37, 166, 167 రెడ్ విత్ 13(2) పీ.ఓ.సీ చట్టంలోని 13(1)(సి)(డి) సెక్షన్ల కింద కేసు నమోదు

    • ఈ పిటీషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన సీఐడీ

      CID-Vs-ACB.jpg

  • 2023-10-09T14:20:00+05:30

    వాదనలు ప్రారంభం

    • చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

    • లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ ప్రారంభమైన వాదనలు

    • బెంచ్‌ మీదకు న్యాయమూర్తులు

    NCBN-SUPREME.jpg

  • 2023-10-09T13:06:00+05:30

    • చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్ట్ వాయిదా వేసింది. మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. లంచ్ తర్వాత తిరిగి విచారణ చేపట్టనుంది.

  • 2023-10-09T12:48:00+05:30

    • చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం

  • 2023-10-09T11:59:00+05:30

    • కాసేపట్లో చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

  • 2023-10-09T11:30:00+05:30

    ఏసీబీ కోర్టులో రెగ్యులర్ వర్క్ స్టార్..

    మరోవైపు.. ఏసీబీ కోర్టులో రెగ్యులర్ వర్క్ మొదలైంది. లంచ్ తరువాత న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు. దీంతో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌పై మధ్యాహ్నం వరకు సస్పెన్స్ కొనసాగనుంది.

  • 2023-10-09T11:29:00+05:30

    3 ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత..

    మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరోసారి నిరాశ ఎదురైంది. ఏపీ ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్లు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్ట్ కొట్టివేసింది. మొత్తం 3 ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్ట్ డిస్మిస్ చేసినట్టయ్యింది. నిజానికి కోర్టులో చంద్రబాబు పిటిషన్లకు సంబంధించి అంగళ్లు కేసులో బెయిల్ రావొచ్చని భావించారు. ఈ కేసులో నిందితులు అందరికీ బెయిల్‌ ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబుకు కూడా ఉపశమనం లభిస్తుందని అంతా భావించారు. కానీ ఈ కేసులో కూడా ఊరట దక్కకపోవడం గమనార్హం.

    Untitled-3.jpg

  • 2023-10-09T11:23:00+05:30

    టీడీపీ అధినేత చంద్రబాబుకు (Nara Chandrababu Naidu) సోమవారం బెయిల్‌ (Bail) వస్తుందా?.. రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి ఆయన బయటకొస్తారా?.. లేదా ఆయన్ను మరోసారి పోలీసు కస్టడీకి పంపుతారా? అన్న ఉత్కంఠ ఇటు రాష్ట్రాలతోపాటు దేశవిదేశాల్లోని తెలుగువారిలో ఉత్కంఠ నెలకొంది. ముందస్తు బెయిల్‌‌కు సంబంధించి హైకోర్టు ఇప్పటికే నిర్ణయాన్ని వెలువరించగా.. ఏసీబీ, సుప్రీంకోర్టుల్లో దాఖలైన పిటిషన్లపై ఉత్కంఠ నెలకొంది. సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై నేడు అతి ముఖ్యమైన తీర్పులు రానున్నాయి.

    అలాగే స్కిల్‌ డెవల్‌పమెంట్‌(Skill Development) వ్యవహారంలో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో పాటు టీడీపీ అధినేతను మరోసారి పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పైనా నిర్ణయం ప్రకటించనుంది. కాగా.. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)లో సోమవారమే విచారణ జరుగనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17 (ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చే ఉత్తర్వులు టీడీపీ అధినేతపై దాఖలైన ఇతర కేసులపైనా ప్రభావం చూపనున్నాయి. దీంతో సోమవారం ఆయనకు, టీడీపీకి, ప్రభుత్వానికి కూడా అత్యంత కీలకంగా మారింది. తీర్పులు ఎలా ఉండబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది.