Vijayawada: గన్నవరంలో వల్లభనేని వంశీకి ఎదురు దెబ్బ
ABN , First Publish Date - 2023-11-16T15:21:11+05:30 IST
విజయవాడ: గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎదురు దెబ్బ తగిలింది. గతంలో వంశీ గెలుపు కోసం సర్నాల బాలాజీ పని చేశారు. అయితే వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బాలాజీ తటస్థంగా ఉండిపోయారు.
విజయవాడ: గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (MLA Vallabhaneni Vamsi)కి ఎదురు దెబ్బ తగిలింది. గతంలో వంశీ గెలుపు కోసం సర్నాల బాలాజీ (Sarnala Balaji) పని చేశారు. అయితే వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ (YCP) పార్టీలో చేరడంతో బాలాజీ తటస్థంగా ఉండిపోయారు. తాజాగా ఆయన యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatarao) సమక్షంలో అధికారికంగా టీడీపీ (TDP) తీర్ధం పుచ్చుకున్నారు. ఐదు వందల మంది అనుయాయులతో కలిసి గురువారం పసుపు కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా సర్నాల బాలాజీ మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇండిపెండెంట్‌గా తమ కుటుంబం ఇక్కడ గెలిచినా.. వైసీపీ నాయకులుగా ప్రచారం చేస్తున్నారని, ఈరోజు యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో అధికారికంగా టీడీపీలో చేరామన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ విజయం ఖాయమని, చంద్రబాబు (Chandrababu)తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని బాలాజీ వ్యాఖ్యానించారు.