Delhi: విజయసాయి ట్వీట్లలో మార్పు: ఎంపీ రఘురామ
ABN , First Publish Date - 2023-02-20T14:33:11+05:30 IST
ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ హ్యాండిల్ ఎవరో చేసి ఉంటారు?.. గతంలో దరిద్రపు ట్వీట్స్ చేస్తుండే వారు?... గత రెండు నెలల నుంచి విజయసాయి ట్వీట్లలో మార్పు కనిపించిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఢిల్లీ: ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ట్విట్టర్ (Twitter) హ్యాండిల్ ఎవరో చేసి ఉంటారు?.. గతంలో దరిద్రపు ట్వీట్స్ చేస్తుండే వారు?... గత రెండు నెలల నుంచి విజయసాయి ట్వీట్లలో మార్పు కనిపించిందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సినీనటుడు తారకరత్న (Tarakaratna) మృతి బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వచ్చిన సందర్భంలో విజయసాయి వ్యవహరించిన తీరు అభినందనీయమని, ప్రశంసనియమని కొనియాడారు. దీన్ని రాజకీయంగా చూడొద్దన్నారు. ఒక నాయకుడికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చారన్నారు.
లక్ష్మీపార్వతి (Lakshmi Parvathi) తారకరత్న మృతిపై మాట్లాడిన తీరు సరికాదని రఘురామ అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) టీడీపీ (TDP)లో చేరడం పెద్ద రాజకీయ పరిణామమని, కన్నా ప్రజా నాయకుడని, కాపు సామాజికవర్గంలో కన్నా పెద్ద లీడర్ అని కొనియాడారు. కన్నా లాంటి నాయకుడు ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నారంటే, వైకాపా (YCP)కు కొంత మైనస్ అని అన్నారు. ప్రజల్లో వైకాపా పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఎక్కువతోందని రఘురామ అన్నారు.
వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో వైఎస్ భాస్కర్ రెడ్డి (Bhaskar Reddy), వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash Reddy)కి నోటీసులు ఇచ్చారని, నాలుగు రోజుల క్రితమే నోటీసులు ఇచ్చినా... మీడియాకు కొంత ఆలస్యంగా తెలిసిందని రఘురామ అన్నారు.
ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ (CBI) అధికారులు గత విచారణ సందర్భంగా నాలుగు గంటలపాటు విచారించారన్నారు. ఒక్కసారి పిలిచిన తర్వాత సీబీఐ మళ్ళీ పిలిచిందంటే ఊహించిన పరిణామాలు ఏమైనా జర్గగొచ్చు? అని అన్నారు.
వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారనేది క్లియర్‌గా సీబీఐ అధికారులు ఫైల్ చేశారని రఘురామ అన్నారు. హత్య చేయించింది ఎవరో తేలాల్సి ఉందన్నారు. రక్తం ఎవరు తుడిచారు? కట్లు ఎవరు వేశారో తేలాల్సి ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో రాజకీయ ప్రభావం ఉంటుందని, కొందరి అనుమానం ప్రకారం హత్య జరిగిందని, ఇంకా రెండు మూడు అరెస్టులు ఉండొచ్చునని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.