ACB Raids: కృష్ణా జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏసీబీ దాడుల కలకలం
ABN , First Publish Date - 2023-08-28T15:27:17+05:30 IST
జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి.
కృష్ణా జిల్లా: జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏసీబీ దాడులు (ACB Raids) కలకలం సృష్టించాయి. రూ.90 వేలు లంచం తీసుకుంటూ ఎక్సైజ్ కోర్టు ఏపీపీ విజయలక్ష్మి, కానిస్టేబుల్ బాలకృష్ణ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత నేతృత్వంలో ఏసీబీ డీఎస్పీలు శ్రీనివాస్, శరత్ దాడి చేశారు. 498A కేసులో బాధితుడు మురళీకృష్ణను ఏపీపీ విజయలక్ష్మి రూ.90వేలు డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన రూ.90 వేలను కానిస్టేబుల్ బాలకృష్ణకు ఇవ్వాలని ఏపీపీ తెలిపారు. ఏపీపీ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ బాలకృష్ణకు బాధితుడు రూ.90వేలు ఇచ్చాడు. అయితే ఈ విషయంపై బాధితుడు ముందస్తుగా ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుుని ఏపీపీ, కానిస్టేబుల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ ఏఎస్పీ స్నేహిత తెలిపారు.