Panchumarthi Anuradha: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనురాధ నామినేషన్ దాఖలు
ABN , First Publish Date - 2023-03-13T13:37:35+05:30 IST
టీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పంచుమర్తి అనురాధ సోమవారం ఉదయం నామినేషన్ ధాఖలు చేశారు
అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) సోమవారం ఉదయం నామినేషన్ ధాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి TDP MLA Butchaiah Chaudhary, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప (Former Minister Nimmakayala Chinarajappa) , ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని (MLA Adireddy Bhavaniతదితరులు పాల్గొన్నారు. అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు.
బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ... పంచుమర్తి అనురాధ బలహీన వర్గాల మహిళను టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నిలబెడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ విధానాల ద్వారా ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్సి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తమకు 23 మంది శాసనసభ్యుల మద్దతు ఉందన్నారు. జగన్ రాష్ట్రంలోని అన్ని రంగాలను నాశనం చేస్తున్నారని విమర్శించారు. మైనార్టీ తీరని వ్యక్తులతో కూడా దొంగ ఓట్లను వేయించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ... చంద్రబాబు (Chandrababu naidu) బీసీ అభ్యర్ధికి అవకాశం ఇచ్చారన్నారు. గ్రాడ్యూయేట్స్, టీచర్లు, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. పదో తరగతి పిల్లలతో గ్రాడ్యూయేట్ ఓట్లు వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దెబ్బతిన్నందునే డబ్బుతో గెలవాలనుకుంటున్నారన్నారు.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మాట్లాడుతూ... అనురాధ పార్టీకి, రాష్ట్రానికి ఎంతో సేవ చేశారన్నారు. టీడీపీకి 23 సభ్యుల బలం ఉందని.. తమకు 22 మంది ఉంటే సరిపోతుందని తెలిపారు. అనురాధ తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. గ్రాడ్యూయేట్స్ ఎ్వవరూ ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయాలని కోరారు.
పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్ తనను అభ్యర్ధిగా నిలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. బడుగు బలహీన వర్గాలకు చెందన తనకు సీటు ఇచ్చారు గనుక అందరూ సహకరించాలని కోరారు.