Deputy CM: పవన్ ప్రసంగాలు ఉన్మాదానికి ఎక్కువ.. పిచ్చికి తక్కువ..

ABN , First Publish Date - 2023-06-27T17:04:47+05:30 IST

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ పవన్ వారాహి యాత్ర అట్టర్ ప్లాప్ అయిందన్నారు.

Deputy CM: పవన్ ప్రసంగాలు ఉన్మాదానికి ఎక్కువ.. పిచ్చికి తక్కువ..

అమరావతి: జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)పై డిప్యూటీ సీఎం (Deputy CM) కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ పవన్ వారాహి యాత్ర (Varahi Yatra) అట్టర్ ప్లాప్ అయిందన్నారు. ఆయన ప్రసంగాలు ఉన్మాదానికి ఎక్కువ.. పిచ్చికి తక్కువగా ఉన్నాయన్నారు. ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ తనను తాను విప్లవ కారుడునని చెప్పుకుంటారని, గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ (YCP)కి రాకుండా అడ్డుకుంటారా? అన్నారు.

సమయం సందర్భం లేకుండా కాపు ఉద్యమనేత ముద్రగడ (Mudragada)పై పవన్ ఆరోపణలు చేస్తారా?.. ముద్రగడపై పవన్ చేసిన ఆరోపణల వల్ల కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. పవన్ తిరిగేదంతా కాపు సామాజిక వర్గాలు ఉండే ప్రాంతాలేనని, వారి మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం ఇదని.. కాపుల్లో చీలిక తెచ్చే ప్రయత్నంగా భావిస్తున్నామని అన్నారు. రైలు దహనం కేసు (Train Burning Case)లో ముద్రగడ చాలా అపవాదులు ఎదుర్కొన్నారని, కులాల చిచ్చు రగిల్చేది పవనేనని.. మళ్ళీ సుద్దులు చెప్పేది ఆయనేనని అన్నారు. పవన్ ప్రసంగాలు ఆయన మానసిక పరిస్థితి ఏమిటో తెలియచేస్తున్నాయన్నారు.

సీఎం జగన్‌ (CM Jagan)ను తిట్టే విషయంలో పవన్ బాగానే మాట్లాడుతున్నారని, కానీ చంద్రబాబు (Chandrababu) గురించి మాట్లాడే విషయంలో తేడా వచ్చేస్తోందని డిప్యూటీ సీఎం అన్నారు. వారాహీ యాత్ర విఫలం అయిందని, ఆయన గ్రాఫ్ పదింతలు కిందకు పడిపోయిందని, పవన్ సభకు హాజరు అయ్యే వారి సంఖ్య వేల నుంచి వందల్లోకి పడిపోయిందన్నారు. పవన్‌ను గోదావరి జిల్లాలకు పంపి ఓట్లు చీల్చలాన్న టీడీపీ (TDP) వ్యూహం పారలేదని, చంద్రబాబు వైపు చేరాల్సిన అవసరం పవన్‌కు ఏమొచ్చిందని, టీడీపీ, జనసేనది అపవిత్రమైన పొత్తు అని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-06-27T17:04:47+05:30 IST