AP Minister: ఈ కొత్త వకీల్ పాత్ర ఏంటి పవన్?..మంత్రి పేర్నినాని ఫైర్
ABN , First Publish Date - 2023-04-17T14:19:57+05:30 IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను జనం మర్చిపోతున్నారని అప్పుడప్పుడు ట్వీట్ పెడుతున్నారని మాజీమంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ను జనం మర్చిపోతున్నారని అప్పుడప్పుడు ట్వీట్ పెడుతున్నారని మాజీమంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ మంత్రి హరీష్ రావు (Telangana Minister Harish Rao) వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మాట్లాడటం తన మనసు గాయపరిచింది అని పవన్ కళ్యాణ్ (Janasena Chefi) అంటున్నారని.. అసలు తెలంగాణ ప్రజలను ఏమీ అనకపోయినా పవన్ తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ మంత్రులను ఏదైనా అంటే పవన్ కళ్యాణ్ బాధ పడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఈ కొత్త బాధ ఎంటో అర్ధం కావడం లేదని అన్నారు. తెలంగాణకు చెందిన మంత్రి ఏపీ రాష్ట్రాన్ని అవమనిచేలా మాట్లాడితే మంత్రులు మాట్లాడతారని స్పష్టం చేశారు. ‘‘పవన్ కళ్యాణ్ ది ఆంద్రప్రదేశ్ కాదా?.. రాజకీయం కోసమే ఆంధ్రప్రదేశ్ కావాలా?.. పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళకి లొంగిపోయాడా?’’ అంటూ వరుసగా ప్రశ్నలు సంధించారు. ఏపీని తెలంగాణ మంత్రి కించపరిస్తే అది వేరే అని పవన్ అంటున్నారన్నారు. తెలంగాణ తరుపున వకాల్తా పుచ్చుకొని పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇవి కిరాయి మాటలు కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు చంద్రబాబు, లోకేష్‌ను అంటే పవన్ వచ్చేవాడని.. ఇప్పుడు తెలంగాణ మంత్రులను ఏదైనా అంటే పవన్ కళ్యాణ్ వకాల్తా పుచ్చుకుంటున్నారని విమర్శించారు. ఈ కొత్త వకీల్ పాత్ర ఏంటో అర్ధం కావడం లేద అంటూ ఏపీ మంత్రి యెద్దేవా చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని కేంద్రం చెబితే పవన్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. పవన్ మళ్ళీ ఢిల్లీ వెళ్లి అడగాలి కదా? అంటూ వివేకా హత్య కేసులో అసలు ముద్దాయిలను వదిలేసి, అసహజ రీతిలో విచారణ జరుగుతుందని మండిపడ్డారు. రాంసింగ్ తప్పుడు మార్గంలో విచారణ జరిపారని.. సుప్రీంకోర్టు రాం సింగ్‌ను పక్కన పెట్టమని చెప్పిందని.. అయితే అదే రీతిలో ఇప్పుడు వచ్చిన అధికారులు విచారణ జరుపుతున్నారని వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కోణంలో విచారణ జరపడం వెనుక ఒత్తుడులు, లొంగుబాటు ఉన్నాయన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా జగన్‌పై హత్యాయత్నం జరిగిందని.. చంద్రబాబు టైమ్‌లో ఏమి విచారణ జరిగిందని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా తప్పుడు దర్యాప్తు చేశారని ఆరోపించారు. చంద్రబాబు అన్ని వ్యస్థలను వశ పర్చుకోవడంలో సిద్ధ హస్తుడని మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు.