TDP: పట్టాభిరామ్ బెయిల్ పిటిషన్‌పై స్పెషల్ కోర్టు తీర్పు ఏంటంటే..?
ABN , First Publish Date - 2023-03-01T19:00:04+05:30 IST
టీడీపీ నేత పట్టాభిరామ్(TDP Pattabhi Ram) బెయిల్, కస్టడీ పిటిషన్లపై కోర్టులో విచారణ జరిగింది. పట్టాభిరామ్‌ను రేపు పీటీ వారెంట్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేస్తామని స్పెషల్ కోర్టు జడ్జి పేర్కొంది.
విజయవాడ: టీడీపీ నేత పట్టాభిరామ్(TDP Pattabhi Ram) బెయిల్, కస్టడీ పిటిషన్లపై కోర్టులో విచారణ జరిగింది. పట్టాభిరామ్‌ను రేపు పీటీ వారెంట్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేస్తామని స్పెషల్ కోర్టు జడ్జి పేర్కొంది. పీటీ వారెంట్‌పై ముందస్తు బెయిల్ పిటిషన్‌కు పట్టాభిరామ్ దాఖలు చేశారు. అలాగే కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఈనెల 3న స్పెషల్ కోర్టు ఆదేశాలివ్వనుంది. సీఐని కులం పేరుతో తిట్టారని పట్టాభిరామ్‌పై ఆరోపణలు ఉన్నాయి. పట్టాభిరామ్‌ను తోట్లవల్లూరు పీఎస్‌లో కొట్టారని లాయర్ వాదనలు వినిపించారు.
ఇదిలా ఉండగా.. గన్నవరంలో జరిగిన ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో పట్టాభి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. కొద్దిరోజుల క్రితం గన్నవరంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పట్టాభితోపాటు తెలుగుదేశం నేతలపై సీఐ కనకరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారని ఆరోపించారు. దాంతో పట్టాభి సహా 13 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో కేసు నమోదు చేశారు.