Krishna Dist.: పోలీసులు, పెట్రోల్ బంక్ మేనేజర్ మధ్య వాగ్వాదం..

ABN , First Publish Date - 2023-05-11T16:55:12+05:30 IST

కృష్ణా: జిల్లాలో పోలీసుల దౌర్జన్యం బయటపడింది. హెచ్‌పీ పెట్రోల్ బంకు (HP Petrol Station)లో పోలీసులు దౌర్జన్యం చేశారు. పోలీసులు, బంక్ మేనేజర్ రామకృష్ణ మధ్య...

Krishna Dist.: పోలీసులు, పెట్రోల్ బంక్ మేనేజర్ మధ్య వాగ్వాదం..

కృష్ణా: జిల్లాలో పోలీసుల దౌర్జన్యం బయటపడింది. హెచ్‌పీ పెట్రోల్ బంకు (HP Petrol Station)లో పోలీసులు దౌర్జన్యం చేశారు. పోలీసులు, బంక్ మేనేజర్ రామకృష్ణ మధ్య వాగ్వాదం చినికి చినికి గాలివానగా మారింది. తర్వాత రామకృష్ణ హనుమాన్ జంక్షన్ (Hanuman Junction) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, హనుమాన్ జంక్షన్‌లో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. అక్కడ పెట్రోల్ బంక్ మేనేజర్‌తో వివాదానికి దిగారు. బంక్‌కు రాగానే తమ వాహనానికి పెట్రోల్ కొట్టలేదని, అలాగే బిల్లులకు సంబంధించి రామకృష్ణ, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక దశలో పోలీసులన్న అహంకారంతో రామకృష్ణపై దాడికి యత్నించారు. దీంతో అక్కడున్న బంక్ సిబ్బంది వారించే ప్రయత్నం చేశారు. ఏఆర్ ఎస్ఐ ఇస్మాయిల్, కానిస్టేబుల్ సూర్యనారాయణలు ఇష్టానుసారంగా మాట్లాడుతూ రామకృష్ణను బెదిరించారు. వారి మధ్య సుమారు 30 నిముషాలపాటు వాదన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-05-11T16:55:12+05:30 IST