Bopparaju Venkateswarlu: ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
ABN , First Publish Date - 2023-10-05T18:20:11+05:30 IST
ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా ఆప్కాస్‌లో చేర్చి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu ) ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విజయవాడ: ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా ఆప్కాస్‌లో చేర్చి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu ) ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నాడు ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు, కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ..‘‘ఆర్టీసీ యాజమాన్యం కాంట్రాక్టర్లకు ఇచ్చే స్కేల్ ప్రకారమే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించాలి. ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం లేదా యాజమాన్యమే డైరెక్టుగా జీతాలు చెల్లించాలి. కాంట్రాక్టు దళారీల వ్యవస్థ నుంచి ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి. ఆర్టీసీలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈఎస్ఐ ద్వారా వైద్యసౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సినీయారిటీ ప్రకారం జీతాలు పెంచాలి’’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.