ACB Court: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్‌లపై తీర్పు సోమవారానికి వాయిదా
ABN , First Publish Date - 2023-10-06T14:36:53+05:30 IST
విజయవాడ: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్, కస్టడీ పిటీషన్‌లపై శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పును న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు. ఇప్పటికే మూడు రోజుల నుంచి ఏ రోజుకారోజు వాదనలు ముగిసి తీర్పు వస్తుందని ఆశించినప్పటికీ..
విజయవాడ: తెలుగుదేశం అధినేత (TDP Chief) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బెయిల్ (Bail), కస్టడీ (Custody) పిటీషన్ (Petition)లపై శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court)లో వాదనలు ముగిసాయి. తీర్పును న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు. ఇప్పటికే మూడు రోజుల నుంచి ఏ రోజుకారోజు వాదనలు ముగిసి తీర్పు వస్తుందని ఆశించినప్పటికీ.. ఇరువురు న్యాయవాదుల మద్య తీవ్రస్థాయిలో వాదోపవాదనలు జరిగాయి. అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. గత కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా న్యాయవాదులు ప్రస్తావించారు. మొన్న మొదలైన వాదనలు శుక్రవారం మధ్యాహ్నంతో ముగిసాయి. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ మేరకు వాయిదా వేశారు. చంద్రబాబుకు బెయిల్ ఇస్తారా? లేక కస్టడీకి ఇస్తారా? అన్న దానిపై దాదాపు 10 రోజుల నుంచి ఏసీబీ కోర్టులో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 4వ తేదీ నుంచి విచారణ పూర్తి స్థాయిలో జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు తరఫున ప్రమోద్ కుమార్ దుబే, సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. కాగా సోమవారం చంద్రబాబుకు బెయిల్ ఇస్తారా? లేక కస్టడీకి ఇస్తారా? అన్నదానిపై అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.