CPM Baburao: మోదానీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
ABN , First Publish Date - 2023-08-31T17:32:22+05:30 IST
మోడీ +అదానీ = మోదానీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఎం సీనియర్ నేత బాబూరావు(CPM Baburao) అన్నారు.
విజయవాడ: మోడీ +అదానీ = మోదానీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఎం సీనియర్ నేత బాబూరావు(CPM Baburao) అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జీఎస్టీ పేరుతో 20 లక్షల కోట్ల రూపాయల లూటీ చేశారు. పెట్రోలు, డీజిల్పై సెస్సులు, పన్నుల రూపంలో 26లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం దండుకున్నది. వంటగ్యాస్పై ధర పూర్తిగా తగ్గించి.. రూ.400కే సిలిండర్ అందరికీ అందజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు నిలిపివేయాలి. ఏపీలో వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేయాలని సీపీఎం బాబూరావు డిమాండ్ చేశారు.