AP News: మైలవరంలో దళితుల ఇళ్లు కూల్చివేత.. ఉద్రిక్తం

ABN , First Publish Date - 2023-06-12T11:34:08+05:30 IST

మైలవరం పట్టణంలో నివాసాల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. మైలవరం పట్టణంలోని పెద్దహరిజనవాడలో నాలుగు నివాసాల కూల్చివేతకు పంచాయతీ అధికారులు సిద్ధమయ్యాయి.

AP News: మైలవరంలో దళితుల ఇళ్లు కూల్చివేత.. ఉద్రిక్తం

ఎన్టీఆర్: మైలవరం పట్టణంలో నివాసాల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. మైలవరం పట్టణంలోని పెద్దహరిజనవాడలో నాలుగు నివాసాల కూల్చివేతకు పంచాయతీ అధికారులు సిద్ధమయ్యాయి. పోలీస్, రెవిన్యూ అధికారుల సమక్షంలో పేదల ఇళ్ళు పడగొట్టేందుకు యత్నించారు. అయితే పంచాయతీ అధికారులను పేదలు అడ్డుకున్నారు. పేదలకు, అధికారులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఆందోళనకు దిగిన నివాసితులను ఎస్‌ఐ హరిప్రసాద్ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఇళ్ళు కూల్చివేయడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమ ఇళ్లను కక్ష పూరితంగా కూల్చివేయడంపై నివాసితులు లబోదిబోమంటున్నారు. వైఎస్ జగన్, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్‌లకు మా ఉసురు తగులుతుందంటూ దళితులు శాపనార్ధాలు పెట్టారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో కక్ష పూరితంగా ఇళ్లను పడగొడుతున్నారని హరిజనవాడ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో మైలవరం ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోస్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2023-06-12T11:34:08+05:30 IST