Devineni Uma: మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపే విధంగా చంద్రబాబు సభలు...
ABN , First Publish Date - 2023-04-06T15:48:21+05:30 IST
కృష్ణాజిల్లా: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లా పర్యటన విజయవంతం చేయడానికి ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలు సమావేశం అయ్యారు.
కృష్ణాజిల్లా: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కృష్ణాజిల్లా (Krishna Dist.) పర్యటన విజయవంతం చేయడానికి ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో మాజీ మంత్రులు దేవినేని ఉమ (Devineni Uma), కొల్లు రవీంద్ర (Kolluu Ravindra), మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు (Konakalla Narayanarao), మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటేశ్వరరావు (Ravi Venkateswararao), బోడె ప్రసాద్ (Bode Pradad), సీనియర్ టీడీపీ నేతలు (Senior TDP Leaders) పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపే విధంగా చంద్రబాబు 'రాష్ట్రానికి ఇదేమి కర్మ' సభలు నిర్వహిస్తారని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్, హరితాంధ్రప్రదేశ్‌గా చేస్తే... జగన్ (Jagan) రాష్ట్రాన్ని గంజాయి (v), అప్పుల ప్రదేశ్ (Appula Pradesh)గా మార్చారని విమర్శించారు. తప్పుడు కేసులు, దాడులతోనే జగన్ పాలన సాగుతోందని దేవినేని ఉమ మండిపడ్డారు.
చంద్రబాబు పర్యటన వివరాలు వెల్లడించిన మాజీ ఎంపీ కొనకళ్ళ
కృష్ణా జిల్లాలో ఈనెల 12,13,14 తేదీల్లో చంద్రబాబు పర్యటనలు ఉంటాయని, నూజివీడులో 12,13 తేదీల్లో బహిరంగ సభ, కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. 13వ తేదీ మధ్యాహ్నం రోడ్ షోగా బయలుదేరి గుడివాడకు వస్తారన్నారు. సాయంత్రం గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. తర్వాత నిమ్మకూరు హాల్ట్ నుంచి గూడూరు, పెడన మీదుగా 14వ తేదీన మచిలీపట్నం వస్తారన్నారు. ఆ సాయంత్రం కోనేరు సెంటర్లో బహిరంగ సభ నిర్వహిస్తారని కొనకళ్ళ నారాయణరావు తెలిపారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ...
చంద్రబాబు బహిరంగ సభలకు కృష్ణ, ఏలూరు జిల్లాల నాయకులు కార్యకర్తలు హాజరవ్వాలని పిలుపిచ్చారు. సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న సీఎం జగన్ ... అభివృద్ధిని పక్కనపెట్టి రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో మట్టి, ఇసుక దోపిడీ వ్యాపారంగా మారిందని, మచిలీపట్నం పోర్టు అటకెక్కిందని కొల్లు రవీంద్ర ఆరోపించారు.