Vijayawada: విద్యుత్ ఉద్యోగుల ధర్నా
ABN , First Publish Date - 2023-08-07T14:33:53+05:30 IST
విజయవాడ: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ విద్యుత్ ఉద్యోగులు సోమవారం ధర్నాకు దిగారు. ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని కార్మిక సంఘం నాయకుడు నాగేశ్వరరావు విమర్శించారు.
విజయవాడ: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ విద్యుత్ ఉద్యోగులు (Electrical Employees) సోమవారం ధర్నా (Dharna)కు దిగారు. ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం (Govt.) అమలు చేయలేదని కార్మిక సంఘం నాయకుడు నాగేశ్వరరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ (PRC)లు, పెండింగ్ డీఎ (DA)లు ఉన్నా సీఎం జగన్ (CM Jagan) పట్టించుకోవడం లేదని, ప్రధానమైన సమస్యలను పరిష్కారం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే జగన్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టామని తెలిపారు. తర్వాత జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ, పెండింగ్ బకాయిలు, మీటర్ రీడర్ల సమస్యలను పరిష్కరించాలని నాగేశ్వరరావు కోరారు.