AP Govt.: జగన్ ప్రభుత్వం మరో రూ. 2 వేల కోట్లు అప్పు
ABN , First Publish Date - 2023-09-12T16:41:47+05:30 IST
అమరావతి: జగన్ సర్కార్ అప్పులను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే వేలకోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం తాజాగా మరో రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్‌లో ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకుంది. అమరావతి: జగన్ సర్కార్ అప్పులను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే వేలకోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం తాజాగా మరో రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్‌లో ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకుంది.
అమరావతి: జగన్ సర్కార్ (Jagan Govt.) అప్పులను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే వేలకోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం తాజాగా మరో రెండు వేల కోట్లు (Two Thousand Crores) అప్పు తీసుకొచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం (Security Bonds Auction) ద్వారా రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank)లో ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకుంది. రూ. వెయ్యి కోట్లు 15 సంవత్సరాలకు 7.48 శాతం వడ్డీతో, మరో వెయ్యి కోట్లు 7.46 శాతం వడ్డీతో 18 సంవత్సరాలకు రుణం తీసుకుంది. ఈ 2 వేల కోట్ల రూపాయలతో ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM) కింద ఇప్పటి వరకూ 40 వేల 500 కోట్ల రూపాయలకు ఏపీ అప్పు చేరింది. ఇవి కాకుండా, కార్పొరేషన్‌ల ద్వారా మరో రూ. 20 వేల కోట్లు అప్పు తెచ్చింది. కాగా ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఈ ఏడాది రూ. 60 వేల 500 కోట్లు అప్పు చేసింది. నిధులు లేకపోవడంతో ప్రభుత్వం ఆగస్టు నెల ఉద్యోగులకు జీతాలు, పెన్షన్‌లు ఆలస్యంగా వేసింది.