Share News

Keshineni Nani: మూడు నెలలు ఆగితే ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది..

ABN , Publish Date - Dec 29 , 2023 | 11:55 AM

విజయవాడ: కోవిడ్ తరువాత పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందివ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఙతలు తెలుపుతున్నానని తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు.

Keshineni Nani: మూడు నెలలు ఆగితే ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది..

విజయవాడ: కోవిడ్ తరువాత పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందివ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఙతలు తెలుపుతున్నానని తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ క్రిటికల్ కేక్ ఫెసిలిటీ విజయవాడకు ఇచ్చినందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియాకు కృతజ్ఙతలు తెలిపారు. మూడు నెలలు ఆగితే ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, నారా చంద్రబాబు నాయకత్వంలో ఓల్డ్ జిజిహెచ్‌ని ఎయిమ్స్ మాదిరి అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో ఓల్డ్ జీజీహెచ్‌లో రోగులకు మంచినీరు కూడా సరిగ్గా సరఫరా చేయటం లేదని జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. క్రిటికల్ కేర్ బ్లాక్, బీఎస్ఎల్-3 ల్యాబ్ కేంద్ర ప్రభుత్వం తన సిఫారసుతోనే మంజూరు చేసిందన్నారు. వైసీపీ పార్టీ అభ్యర్థులను నియోజకవర్గాలు మార్చడం ఆ పార్టీ ఇష్టమని, ఆ పార్టీపై తానేమీ మాట్లాడనని కేశినేని నాని స్పష్టం చేశారు.

Updated Date - Dec 29 , 2023 | 11:55 AM