AP High Court: ఎంపీ రఘురామ కస్టోడియల్ టార్చర్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

ABN , First Publish Date - 2023-05-12T14:59:59+05:30 IST

అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghurama Krishnamraju) కస్టోడియల్ టార్చర్‌ (Custodial Torture)పై ఏపీ ప్రభుత్వానికి (AP Govt.) షాక్ (Shok) తగిలింది.

AP High Court: ఎంపీ రఘురామ కస్టోడియల్ టార్చర్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghurama Krishnamraju) కస్టోడియల్ టార్చర్‌ (Custodial Torture)పై ఏపీ ప్రభుత్వానికి (AP Govt.) షాక్ (Shok) తగిలింది. దీనిపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు (Key Orders) జారీ చేసింది. రఘురామను అదుపులోకి తీసుకున్న సమయంలో కాల్‌ డేటా (Call Data)ను స్వాధీనం చేసుకొని భద్ర పరచాలని, కాల్ డేటాను వెంటనే సేకరించాలని సీబీఐ (CBI)కు ఏపీ హైకోర్టు ఆదేశించింది.

కాగా తన కస్టోడియల్ టార్చర్‌పై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేశారు. శుక్రవారం విచారణకు వచ్చింది. టెలికం నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాలు మాత్రమే కాల్ డేటా ఉంచుతారని రఘురామ తరఫు న్యాయవాది నౌమీన్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కాల్ డేటాను ప్రిజర్వ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్దించారు.

తర్వాత సీబీఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ హరినాధ్ వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ సిఐడీ వద్ద ఉందని, అందువల్ల కాల్ డేటాను సీఐడీ అధికారులే సేకరించాలని అన్నారు. పిటీషనర్ ఆరోపణలే సిఐడీ మీద అయితే... అదే సంస్థను కాల్ డేటా ఎలా సేకరించమంటారని హైకోర్టు ప్రశ్నించింది. కాగా ఈ కేసులో సీఐడీ ఇంప్లీడ్ పిటీషన్ వేసింది. కాల్ డేటా సేకరించమనడం చట్టవిరుద్దమని సీఐడీ తరపు న్యాయవాది అన్నారు. అయితే సీఐడీ ఇంప్లీడ్ పిటీషన్‌ను ఇంకా అనుమతించలేదని హైకోర్టు పేర్కొంది. సీబీఐకు ఇవ్వాలా... లేదా అనేది కోర్టు ఇంకా నిర్ణయించలేదని, ఈ కేసులో కాల్ డేటా కీలకమని న్యాయవాది నౌమీన్ వాదించారు. దీంతో వెంటనే కాల్ డేటాను సేకరించి భద్రపరచాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశిస్తూ.. కేసు తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరానికి వాయిదా వేసింది.

Updated Date - 2023-05-12T14:59:59+05:30 IST