NIA Court: కోడికత్తి కేసులో విచారణ ప్రారంభం
ABN , First Publish Date - 2023-04-17T12:56:53+05:30 IST
కోడి కత్తి కేసు విచారణ సోమవారం విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో ప్రారంభమైంది.
విజయవాడ: కోడి కత్తి కేసు (Kodikatti Case) విచారణ సోమవారం విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు (NIA Court) లో ప్రారంభమైంది. కోడి కత్తి కేసులో లోతైన దర్యాప్తు కోరుతూ సీఎం జగన్ (CM Jagan) దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. ఎన్‌ఐఏ, నిందితుడి తరపున న్యాయవాదులు వేసిన కౌంటర్‌లపై సీఎం జగన్ తరపు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో ఫైనల్ రిపోర్ట్ వెయ్యనందున సామాన్యూలు ఎవరైనా విచారణ ఇంకా జరుగుతూనే ఉందనుకుంటారని తెలిపారు. స్టేట్ పోలీస్‌లు రిలీజ్ చేసిన ఫ్లెక్సీ... నిందితుడు వైసీపీ సింపతైజర్ అని చెప్పేందుకు కావాలనే ప్రయత్నించారన్నారు. నిందితుడి కుటుంబానికి జన్మభూమి కమిటీ ద్వారా ఇంటి స్థలం కూడా సాంక్షన్ అయిందని కోర్టుకు తెలిపారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్, టీడీపీతో సంబంధాలు ఉన్న వ్యక్తికి ఎయిర్‌పోర్టులో ఎలా ఉద్యోగం ఇచ్చారని ప్రశ్నించారు. ఇవన్నీ అనేక అనుమానాలకు కారణం అవుతున్నాయన్నారు. అలాగే ఆపరేషన్ గరుడ అంశాన్ని జగన్ తరపు న్యాయవాది తన వాదనలో ప్రస్తావించారు. బాధితునిగా సీఎం జగన్‌కు ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయించాలని అడిగే హక్కు ఉంటుంది అంటూ వాదనలు వినిపించారు.
సాక్ష్యం నమోదుకు అడ్వకేట్ కమిషనర్‌ను నియమించాలని అభ్యర్థించారు. కోడి కత్తి కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన 23 రోజుల్లోనే ఎన్‌ఐఏ అభియోగం పత్రం దాఖలు చేసిందని.. అయితే అంత తొందరగా అభియోగం పత్రం ఎలా దాఖలు చేయగలుగుతారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 39 మంది సాక్షులను 5 రోజులోనే విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేశారన్నారు. ఒకే రోజున 35 మంది సాక్ష్యాలను విచారించారని... మూడు బృందాల అధికారులు ఈ విచారణ చేశారని తెలిపారు. ఛార్జిషీట్ చదివితే తదుపరి దర్యాఫ్తు అవసరమని సాధారణ పౌరుడికి అర్ధమవుతుందని చెప్పారు. జగన్ వాగ్మూలాన్ని అదనపు ఎస్పీ తీసుకున్నారన్నారు. నిందుతుడు శ్రీనును హర్షవర్ధన్ పథకం ప్రకారమే రెస్టారెంట్‌లోకి తీసుకెళ్లారని తెలిపారు. నిందితుడి గ్రామంలో ఫ్లెక్సీపై గరుడ ఫోటో ఎందుకు వచ్చిందని జగన్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి.