Sad incident: కృష్ణా జిల్లాలో కలకలం రేపుతున్న జంట హత్యలు.. అతికిరాతకంగా నడిరోడ్డుపై వెంబడించి..
ABN , First Publish Date - 2023-09-21T16:15:59+05:30 IST
జిల్లాలోని మొవ్వ మండలం అయ్యంకిలో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో భార్యాభర్తలను ప్రత్యర్థులు హత్య చేశారు. అయ్యంకి పంచాయతీ కార్యాలయం వద్ద భర్త వీరంకి గణేష్‌ను, ఆ సమీపంలోని నడిరోడ్డుపై భార్య వరలక్ష్మిని వెంబడించి అతి కిరాతకంగా ప్రత్యర్థులు నరికి చంపేశారు.
కృష్ణా జిల్లా: జిల్లాలోని మొవ్వ మండలం అయ్యంకిలో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో భార్యాభర్తలను ప్రత్యర్థులు హత్య చేశారు. అయ్యంకి పంచాయతీ కార్యాలయం వద్ద భర్త వీరంకి గణేష్‌ను, ఆ సమీపంలోని నడిరోడ్డుపై భార్య వరలక్ష్మిని వెంబడించి అతి కిరాతకంగా ప్రత్యర్థులు నరికి చంపేశారు. ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. తమ్ముడు వీర కృష్ణతో, మృతుడు గణేష్‌కు మధ్య ఆస్తి గొడవలు కొంతకాలంగా జరుగుతున్నాయి. 2009లో వీర కృష్ణ హత్య జరిగింది. వీర కృష్ణ హత్యకు గణేష్ కారణమని భావించి కొంత కాలంగా పగతో రగిలిపోతున్నారు. ఇదే అదును అనుకుని గణేష్ అతని భార్యను వీరకృష్ణ కుమారులు గొడళ్లతో పట్టపగలు నడిసెంటర్లో హతమార్చారు. ఒకేరోజు జంట హత్యలు జరగడంతో మొవ్వ మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఒక్కసారిగా ఒకేరోజు జంట హత్యలు చోటుచేసుకోవడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి క్లూస్ టీం తో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆధారాల కోసం దగ్గరిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం కూచిపూడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.