Krishna Dist.: మూల్పూరి కల్యాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2023-04-10T08:52:31+05:30 IST

కృష్ణా జిల్లా: తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణి (Maalpuri Kalyani)ని హనుమాన్ జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Krishna Dist.: మూల్పూరి కల్యాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

కృష్ణా జిల్లా: తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణి (Maalpuri Kalyani)ని హనుమాన్ జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరంలో ఫిబ్రవరి 20న టీడీపీ (TDP), వైకాపా (YCP) మధ్య జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన రెండు కేసుల్లో కల్యాణి నిందితురాలిగా ఉన్నారు. దీంతో ఆమెకు ముందస్తు బెయిల్ (Anticipatory Bail) రాకపోవడంతో అప్పటి నుంచి అజ్ఞాతం (Anonymity)లోకి వెళ్లిపోయారు. కాగా హనుమాన్ జంక్షన్‌లోని తన నివాసంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో సోమవారం తెల్లవారుజామున కల్యాణి ఇంటిని ముట్టడించి, అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-04-10T08:52:31+05:30 IST