Vijayawada: చెత్త పన్ను రద్దు చేయాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో మహాధర్నా
ABN , First Publish Date - 2023-03-26T13:34:47+05:30 IST
విజయవాడ: ఏపీ (AP)లో చెత్త పన్ను (Garbage Tax)ను తక్షణమే రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు (TDP Leaders) మహాధర్నా (Mahadharna) చేపట్టారు.
విజయవాడ: ఏపీ (AP)లో చెత్త పన్ను (Garbage Tax)ను తక్షణమే రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు (TDP Leaders) మహాధర్నా (Mahadharna) చేపట్టారు. ధర్నా చౌక్‌లో మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బోండా ఉమామహేశ్వరరావు (Bonda Uma) మాట్లాడుతూ... ప్రజలపై భారం పడుతున్న చెత్త పన్ను, పెరిగిన ఇంటి పన్నులు (House taxes) రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చిన మరుక్షణమే చెత్త మీద వేసినా పన్నును రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
సంక్షేమం పేరుతో ఇచ్చేది గోరంత.. దోచుకునేది కొండంత.. అంటూ బోండా ఉమా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చెత్త మీద పన్నును రద్దు చేస్తామని సాక్షాత్తు తమ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కూడా ఇప్పటికే చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చెత్త పన్ను కట్టమని ఎవరన్నా అధికారులు వేధిస్తే ముందు పోరాడేది తానేనని బోండా ఉమ స్పష్టం చేశారు. కాగా ఈ మహా ధర్నాకు టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.