Vijayawada: ఏపీ ప్రభుత్వ అధ్వర్యంలో మేదోమధన సదస్సు
ABN , First Publish Date - 2023-06-06T16:14:10+05:30 IST
విజయవాడ: ఏపీ వ్యవసాయ, వాణిజ్య పంటల ఎగుమతులపై మంగళవారం విజయవాడలో ఏపీ ప్రభుత్వ అధ్వర్యంలో మేదోమధన సదస్సు నిర్వహించారు.
విజయవాడ: ఏపీ వ్యవసాయ, వాణిజ్య పంటల ఎగుమతులపై మంగళవారం విజయవాడలో ఏపీ ప్రభుత్వ (AP Govt.) అధ్వర్యంలో మేదోమధన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Minister Kakani Govardhan Reddy) మాట్లాడుతూ.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రైతుకు ఎలా తీసుకురావాలనే లక్ష్యంతో ఈ వర్క్ షాపు నిర్వహించామన్నారు. వ్యవసాయం రైతుకు లాభసాటిగా మార్చాలని సీఎం జగన్ (CM Jagan) నిర్ణయాలు తీసుకుంటున్నారని, భగవంతుడికి ప్రసాదం పెట్టాలన్నా రైతు పండించినదే పెట్టాలన్నారు. రైతులకు మరింత వెసులుబాటు కలిగించేలా కార్యక్రమాలు చేయాలని సీఎం ఆదేశించారన్నారు.
మల్టీ పర్పస్ గోడౌన్‌లు వస్తున్నాయని, సొసైటీలు, మార్కెట్ యార్డులు రాజకీయ పునరావాసాలుగా మారిపోకుండా డిజిటల్ విధానం తెచ్చామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. వంద దేశాలకుపైగా మన వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసే అవకాశం ఉందని, ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన యూనివర్సల్‌గా మారడానికి కారణం ఆంధ్రప్రదేశ్ అని, రైతు అసలైన శాస్త్రవేత్త అని.. రైతు మాత్రమే ప్రయోగాలు చేయడానికి అర్హుడని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాగా కాకాణి గోవర్ధన్ రెడ్డి పొలిటికల్ కామెంట్లు చేశారు. ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి ఎవరు చేసారనేది పోలీసులు తేలుస్తారన్నారు. ఈలోపే సజ్జల పేరు, తన పేరు.. ఇలా ఎవరికి తోచిన పేరు వాళ్ళు చెపుతున్నారని, టీడీపీ కామెంట్లు అసలు పట్టించుకోవక్కర్లేదన్నారు. కోర్టులో చోరీ అంశంలో సీబీఐ విచారణను స్వాగతిస్తున్నానని, కోర్టులో చోరీ విషయంలో ఏం జరిగిందో త్వరలో తేలుతుందని.. అప్పుడు తాను కోర్టులో చోరీ అంశంపై కామెంట్ చేస్తానని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు.