Minister Peddireddy: విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదు..
ABN , First Publish Date - 2023-08-09T14:25:38+05:30 IST
అమరావతి: విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష ముగిసింది. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...
అమరావతి: విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ (CM Jagan) నిర్వహించిన సమీక్ష ముగిసింది. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandrareddy) పాల్గొన్నారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల డిమాండ్ల (Electrical Employees Demands)పై సీఎంతో చర్చించామని, విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లే ఆస్కారం లేదని అన్నారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో 4 గంటలకు విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. ఉద్యోగుల సమ్మె నోటీసులోని డిమాండ్ల పరిష్కారంపై చర్చిస్తామన్నారు. అలాగే సచివాలయంలో ఉద్యోగ సంఘాలతోనూ చర్చలు జరుపుతామన్నారు. డిమాండ్ల పరిష్కారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో చర్చలకు రావాలని ఉద్యోగుల ఐకాస నేతలను ఆహ్వానించామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
కాగా ఈ అర్థరాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రకటించారు. అంతకు ముందే ఈ అంశంపై మంత్రులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చర్చించారు. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో చర్చించి సమ్మె వాయిదా వేసుకోవాలని ఎండీ విజయానంద్ కోరగా.. జేఏసీ నేతలు ససేమిరా అన్నారు. దీంతో హడావిడిగా మంత్రులు, అధికారులు మధ్య సీఎం క్యాంప్ కార్యాలయంలో చర్చలు జరిపారు.