MP Keshineni Nani: నేడు దేశ చరిత్రలో చీకటి రోజు, దుర్ధినం
ABN , First Publish Date - 2023-09-09T16:03:00+05:30 IST
వైసీపీ ప్రభుత్వం(YCP Govt) కక్షపూరితంగా నేడు చంద్రబాబును అరెస్ట్(Chandrababu arrested) చేయడం భారతదేశ చరిత్రలో చీకటి రోజు, దుర్ధినమని టీడీపీ ఎంపీ కేశినేని నాని(TDP MP Keshineni Nani) అన్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు.
విజయవాడ: వైసీపీ ప్రభుత్వం(YCP Govt) కక్షపూరితంగా నేడు చంద్రబాబును అరెస్ట్(Chandrababu arrested) చేయడం భారతదేశ చరిత్రలో చీకటి రోజు, దుర్ధినమని టీడీపీ ఎంపీ కేశినేని నాని(TDP MP Keshineni Nani) అన్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఎంపీ కేశినేని కార్యాలయం బయట నల్ల జెండాలతో డౌన్ డౌన్ సీఎం అంటూ జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలి.1978లో మొదటిసారిగా చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యారు. వెంకయ్యనాయుడు, వైఎస్సార్ కూడా అప్పుడే వచ్చారు45 యేళ్ల రాజకీయ ప్రస్థానం చంద్రబాబుది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం, సమాజం కోసం చంద్రబాబు పని చేశారు.ఉమ్మడి ఏపీ, విభజన ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు కష్టపడ్డారు. ఎన్టీఆర్ బాటలో చంద్రబాబు పార్టీని ముందుకు తీసుకెళ్లారు.నేడు హైదరాబాద్ అభివృద్ధి అంటే చంద్రబాబు కృషి ఫలితమే. విభజన తర్వాత చంద్రబాబుతో అభివృద్ధి సాధ్యమని ఏపీ ప్రజలు పట్టం కట్టారు.చంద్రబాబుపై నమ్మకంతో 33 వేల ఎకరాలు రాజధానికి ఇచ్చారు. జగన్మోహన్‌రెడ్డి సీఎం అయిన నాటి నుంచే చంద్రబాబును ఇరికించాలని కంకణం కట్టారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి.. నేడు అన్యాయంగా అరెస్టు చేశారు. అమరావతి భూములు అన్నారు... ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు.. రాజకీయ కక్షతో కేసులు పెట్టి ఆనందం పొందుతున్నారు.
ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయి... జగన్‌కు తన ఓటమి ఖాయమని తెలుసు. అందుకే చంద్రబాబును ముద్దాయిగా చూపడానికి కుట్రలు చేశారు. బటన్ నొక్కితే సంక్షేమం అని జగన్ ప్రగల్భాలు పలుకుతున్నారు. పాలన శూన్యం, సంక్షేమం శూన్యం, అభివృద్ధి శూన్యం. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు పాలనను ప్రజలు కోరుకుంటున్నారు. ప్రపంచంలోని మేధావులతో చంద్రబాబు శభాష్ అనిపించుకున్నారు. అతి తక్కువ మంది అవినీతి మచ్చ లేని వారిలో చంద్రబాబు ఒకరు. జగన్మోహన్‌రెడ్డి ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి.. నిన్న మేము... నేడు మీరు... రేపు మేము వస్తాం. చర్యలకు ప్రతి చర్యలు తప్పకుండా ఉంటాయి.ఐఎఎస్ ఐపీఎస్‌లు వ్యక్తి కోసం పని చేయడం మానుకోవాలి. వారి అధికారం గాడి తప్పింది... పోస్ట్‌ల కోసం రాజకీయ నాయకుల కాళ్లు పట్టుకుంటున్నారు.దేశం కోసం, రాష్ట్రం కోసం మీరు పని చేయాలి. చంద్రబాబు తప్పకుండా ఈ అవినీతి కేసుల నుంచి బయటకి వస్తారు.ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ఇతర పెద్దలకు ఈ కేసులపై లేఖలు రాశాను. జీ 20 హడావుడి తగ్గాక నేరుగా వెళ్లి మోదీ, అమిత్ షాని కలిసి రాష్ట్ర పరిస్థితులపై వివరిస్తా’’ అని ఎంపీ కేశినాని నాని పేర్కొన్నారు.