MP Keshineni Nani: మంచి నీటి కొరత లేకుండా చర్యలు..
ABN , First Publish Date - 2023-07-18T16:37:28+05:30 IST
విజయవాడ: ఎంపీ నిధులతో కొండపల్లి మున్సిపాలిటీకి ఆరు వాటర్ ట్యాంకర్లు, రెండు ట్రాక్టర్ ఇంజన్లు ఎంపి కేశినేని నాని అందచేశారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు పరిధిలో మంచి నీటి కొరత లేకుండా...
విజయవాడ: ఎంపీ నిధులతో కొండపల్లి మున్సిపాలిటీ (Kondapally Municipality)కి ఆరు వాటర్ ట్యాంకర్లు, రెండు ట్రాక్టర్ ఇంజన్లు ఎంపి కేశినేని నాని (MP Keshineni Nani) అందచేశారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు పరిధిలో మంచి నీటి కొరత లేకుండా తన వంతుగా చర్యలు చేపట్టానన్నారు. నీటి ఎద్దడి నివారించేందుకు రూ. 13 కోట్ల వ్యయంతో బృహత్తర కార్యక్రమం ప్రారంభించానన్నారు. ఎంపీ నిధుల ద్వారా వాటర్ ట్యాంక్‌ల నిర్మాణం, గ్రామాలకు వాటర్ ట్యాంకర్లు అంద చేస్తున్నామన్నారు. ఇప్పటికే అనేక గ్రామాలకు వాటర్ ట్యాంకర్లు (Water Tankers) పంపించామని, మరో 250 ట్యాంకర్లు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రతి వారం వీటిని పంపిణీ చేసేలా కార్యక్రమాలు చేపడతామని, భారతదేశంలోనే ఈ విధంగా ఎవరూ చేయలేదన్నారు.
ఇవాళ కొండపల్లి మున్సిపాలిటీకి యాభై లక్షల బడ్జెట్‌తో ఆరు వాటర్ ట్యాంకర్లు, రెండు ట్రాక్టర్ ఇంజన్లు అధికారులకు అప్పగించామని ఎంపీ కేశినేని నాని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, కమిషనర్ కోరిక మేరకు ఈరోజు ట్యాంకర్లు ఇచ్చామన్నారు. ఇదే విధంగా అన్ని గ్రామాలలో మంచినీటి సమస్య లేకుండా ట్యాంకర్లు సరఫరా చేస్తామన్నారు. అందరి దాహార్తిని తీర్చాలనేది ఎన్టీఆర్ లక్ష్యమని, చంద్రబాబు (Chandrababu) స్పూర్తితో ముందుకు సాగుతున్నామని ఎంపి కేశినేని నాని పేర్కొన్నారు.