Raghurama: బిల్లులు చెల్లించని వారు రాజధాని ఎలా కడతారు?...

ABN , First Publish Date - 2023-02-17T16:00:27+05:30 IST

ఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghuramakrishnamraju) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Raghurama: బిల్లులు చెల్లించని వారు రాజధాని ఎలా కడతారు?...

ఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghuramakrishnamraju) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సంక్షోభంలో సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, అన్నం పెట్టండని ఎస్సీ విద్యార్థులు ఘోషిస్తున్నారన్నారు. 150 కోట్ల రూపాయలు సంక్షేమ హాస్టల్స్ భోజనాలకు, కూరగాయాలు సరఫరా చేసే వారికి నిధులు చెల్లించడం లేదని... బిల్లులు చెల్లించని వారు రాజధాని ఎలా కడతారని ప్రశ్నించారు. బాలికల సంక్షేమ, వసతి గృహం అంటారు.. పిల్లలకు అన్నం కూడా పెట్టలేని మన సంక్షేమాన్ని ఏమంటారని నిలదీశారు. మంచి అన్నం, చక్కటి కూరతో భోజనం పెట్టాలని జగన్ ప్రభుత్వానికి సూచించారు.

కాకినాడ జిల్లాలో కలకలం...

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సభలకు జనాలు పెద్ద ఎత్తున్న తరలి వస్తున్నారని, నరసాపురంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 30 వేల మెజారిటీ ప్రతిపక్ష కూటములకు వస్తుందని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తంలో వైకాపాకు 25 స్థానాలు కూడా రావాని పందెం రాయుళ్లు పందెం వేసుకుంటున్నారన్నారు. నిన్న కాకినాడ (Kakinada), పెద్దాపురం (Peddapuram), సామర్లకోట (Samarlakota)లో ఇతర ప్రాంతాల్లో వైకాపా నెగ్గిన స్థానాల్లో టీడీపీ (TDP)కి జనాలు వస్తున్నారని, అత్మలోకం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావడం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) ఆలస్యంగా మెలుకొన్నారని రఘురామ అన్నారు.

యువగళం అంటే ఉలుకెందుకు?...

యువగళం (Yuvagalam) అంటే ఉలుకెందుకని, నారా లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra)ను అడ్డుకోవడం ఎందుకు?... వైకాపా గతంలో యాత్ర చేస్తే ఎవరు అడ్డుకోలేద

ని రఘురామ అన్నారు. పాదయాత్రను దండయాత్రగా మర్చొద్దని లోకేష్ చెప్తున్నారన్నారు. మంత్రి అంబటి (Ambati) లోకేష్‌కు తెలుగు మాట్లాడరాదు అంటున్నారు... మరి సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) ఎం మాట్లాడారని ప్రశ్నించారు. లోకేష్ వేరే దేశంలో చదువుకున్నారు.. ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే సభలో జనాలకు అర్థం కాదు... అయినా లోకేష్ బాగానే మాట్లాడుతున్నారన్నారు. సభను ఇబ్బంది పెట్టేందుకు అంతమంది పోలీసులు ఎందుకని ప్రశ్నించారు.

రాజమండ్రి ఎంపీ మర్గాని భరత్ (Margani Bharat).. లోకేష్‌పై విమర్శలు చేశారని, ఒక్కసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియోలను మర్గాని భరత్ చూస్తే అర్థమవుతుందన్నారు. లోకేష్ పాదయాత్ర జరగనివ్వనని మార్గని భరత్ అంటున్నారు... ముఖ్యమంత్రి ఏమైనా చెప్పరా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

Updated Date - 2023-02-17T16:04:44+05:30 IST