Net connectivity: ఏపీ అసెంబ్లీ ప్రాంగణాల్లో నిలిచిన నెట్.. గవర్నర్ ప్రసంగం మొదలైనప్పటికీ

ABN , First Publish Date - 2023-03-14T10:50:55+05:30 IST

ఏపీ సచివాలయం, శాసనసభ ప్రాంగణాల్లో ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది.

Net connectivity: ఏపీ అసెంబ్లీ ప్రాంగణాల్లో నిలిచిన నెట్.. గవర్నర్ ప్రసంగం మొదలైనప్పటికీ

అమరావతి: ఏపీ సచివాలయం ( AP secretariat), శాసనసభ ప్రాంగణా (AP assembly premises) ల్లో ఇంటర్నెట్ (Internet) సేవల్లో అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచి ఏపీ సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణాల్లో నెట్ నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో నెట్ నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు. అయితే కాసేపటి క్రితమే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగ సమయంలోనూ నెట్ కనెక్టివిటీ (Net connectivity) పునరుద్దరణ కాలేని పరిస్థితి. నెట్ లేకపోవడంతో అసెంబ్లీ, సచివాలయంలలో ఫేస్ రికాగ్నిజేషన్ డివైస్‌ (Face recognition device)లు పనిచేయకుండా పోయాయి. మరోవైపు అన్ని శాఖల ఆఫీస్‌లలోనూ నెట్ డౌన్ అవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్వర్ డౌన్ అయిందని అధికారులు అంటున్నారు. నెట్‌ను పునరుద్దరించేందుకు అధికారులు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏపీ ప్రజల ఆకాంక్షల కోసం సీఎం పాలన: గవర్నర్

మరోవైపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశా (AP Assembly Budget Session)ల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం సీఎం పాలన సాగుతోందన్నారు. సమీకృత అభివృద్ధి కోసం పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు. ఏపీలో నవరత్నాలతో సంక్షేమ పాలన జరుగుతోందని గవర్నర్‌ నజీర్‌ పేర్కొన్నారు. డీబీటీ ద్వారా అవినీతి లేకుండా లబ్దిధారులకే సొమ్ము అందజేస్తున్నామన్నారు. గ్రామ సచివాలయాలతో ప్రజల దగ్గరకే పాలన అందిస్తున్నామని తెలిపారు. 45 నెలల్లో 1.97 లక్షల కోట్ల నగదు ప్రజలకి చేరిందన్నారు. లబద్ధిదారుల గుర్తింపుకోసం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazeer) చెప్పారు.

Updated Date - 2023-03-14T10:50:55+05:30 IST