MLC Elections: ఏపీ అసెంబ్లీ గ్యాలరీల్లోకి మీడియాకు నో ఎంట్రీ
ABN , First Publish Date - 2023-03-23T09:59:38+05:30 IST
ఏపీ అసెంబ్లీ, కౌన్సిల్ గ్యాలరీల్లోకి మీడియాకు అనుమతి నిరాకరించారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ, కౌన్సిల్ గ్యాలరీ (AP Assembly, Council Gallery) ల్లోకి మీడియా (Media) కు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసనమండలి సంయుక్త కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డి (MLC Election Returning Officer, Joint Secretary Legislative Council PV Subbareddy) ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్ గ్యాలరీల్లోకి మీడియాతో పాటు ప్రభుత్వ అధికారుల (Government Officers) కు నో ఎంట్రీ అని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) జారీ చేసిన అథారిటీ లెటర్స్ ఉన్న మీడియాకు మాత్రం అసెంబ్లీ ప్రాంగణంలోని నిర్దేశిత ప్రదేశం వరకు అనుమతి ఉంటుందని అన్నారు. నాలుగవ బ్లాకు పబ్లిసిటీ సెల్ నుంచి యధావిధిగా అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల లైవ్ కవరేజ్ (LIVE Coverage) ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 4 వరకు అసెంబ్లీ భవనంలో ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో 7 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నారు. ఏడుగురు వైసీపీ (YCP), ఒకరు టీడీపీ అభ్యర్థి (TDP candidate) బరిలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది.