Pattabhiram: అప్పుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన జగన్..
ABN , First Publish Date - 2023-07-30T14:04:52+05:30 IST
అమరావతి: ఆర్బీఐ నుంచి అప్పులు చేయడంలో జగన్మోహన్ రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించారని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.29,500 కోట్లు అప్పు చేసి ఆర్బీఐ అప్పుల్లో రాష్ట్రాన్ని ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలిపారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు.
అమరావతి: ఆర్బీఐ (RBI) నుంచి అప్పులు చేయడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సరికొత్త రికార్డు (Record) సృష్టించారని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.29,500 కోట్లు అప్పు చేసి ఆర్బీఐ అప్పుల్లో ఏపీని ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలిపారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం (Kommareddy Pattabhiram) అన్నారు. ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లో ఆర్బీఐ నుంచి రూ. 40 వేల కోట్ల అప్పుతో తమిళనాడు (Tamilnadu) మొదటి స్థానంలో ఉంటే.. రూ. 29,500 కోట్ల అప్పుతో ఏపీ (AP) రాష్ట్రం 2వ స్థానంలో నిలిచిందన్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటి వరకు 17 సార్లు ఆర్బీఐ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆక్షన్ నిర్వహించి అప్పులిస్తే.. మన రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా 14 సార్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుందని ఆరోపించారు.
దేశంలో మరే ఇతర రాష్ట్రం కూడా 14 మంగళవారాలు ఆర్బీఐ దగ్గర అప్పు చేయలేదని పట్టాభిరాం అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ వద్ద మొట్ట మొదటగా అప్పు చేసి, బోణీ చేసిన రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఘనత సాధించిందన్నారు. పొరుగు రాష్ట్రాలైన కర్నాటక (Karnataka), ఒరిస్సా (Orissa) ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క పైసా కూడా అప్పు చేయలేదన్నారు. 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రూ. 29,500 కోట్లు అప్పు చేస్తే.. పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర (Maharastra) రూ.23,000 కోట్లు, రాజస్థాన్ (Rajasthan) రూ. 20,500 కోట్లు, ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రూ.9,500 కోట్లు, మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రూ.6,000 కోట్లు, వెస్ట్ బెంగాల్ (West Bengal) రూ.6,800 కోట్లు, గుజరాత్ (Gujarath) 5,500 కోట్లు మనకంటే చాలా తక్కువగా అప్పు చేశాయన్నారు. ఇప్పటికే మనకున్న రుణ పరిమితిలో 97.4 శాతం ఒక్క ఆర్బీఐ నుండే అప్పు చేయడం జరిగిందన్నారు. కానీ.. మనకంటే ఎక్కువ అప్పు చేసిన తమిళనాడు ఇప్పటి వరకు వారికి ఉన్న రుణ పరిమితిలో కనీసం 50 శాతం కూడా అప్పు చేయలేదని, విచ్చలవిడిగా అప్పులు చేసి, భారీ అవినీతికి పాల్పడి దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా జగన్ అవతరించారని పట్టాభిరాం వ్యాఖ్యానించారు.