Raghurama: జగన్..భయంతో ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నారు..
ABN , First Publish Date - 2023-03-23T16:23:02+05:30 IST
ఏపీలో ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఎప్పుడూ.. ఎవరిని మందలించని సీఎం జగన్ (CM Jagan).. ఇప్పుడు భయంతో అందరితో మాట్లాడుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఢిల్లీ: ఏపీలో ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఎప్పుడూ.. ఎవరిని మందలించని సీఎం జగన్ (CM Jagan).. ఇప్పుడు భయంతో అందరితో మాట్లాడుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అందరికీ నియోజకవర్గం నిధులు ఇస్తానని ముఖ్యమంత్రి అంటున్నారన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (TDP)కి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. కావాల్సింది 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమేనని అన్నారు. టీడీపీ నేత అనురాధ (Anuradha) ఎమ్మెల్సీగా నెగ్గుతారని తెలుస్తోందన్నారు.
టీడీపీ నెగ్గదనీ.. వారికి అసెంబ్లీలో బలం లేదనీ సాక్షిలో రాసుకుంటున్నారని రఘురామ విమర్శించారు. మాట్లాడితే విలువల గురించి ముఖ్యమంత్రి చెబుతారని, ఇప్పుడు ఎంత కష్టం వచ్చింది.. అందరినీ బ్రతిమాలుకుంటున్నారని, మంత్రులకు ఎమ్మెల్సీలను చూస్కోమని చెబుతున్నారన్నారు. గతంలో దేవుడు మొట్టికాయలు వేశారు.. అందుకే టీడీపీకి 23 ఇచ్చారని విమర్శలు చేశారన్నారు. ఇప్పుడు పట్ట భద్రుల ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందని.. అందుకే భయం కలిగిందన్నారు. అంతరాత్మ ప్రబోధం ప్రకారం మిగతా వారు కూడా ఓటు వేస్తారని, ప్రతిపక్ష ఎమ్మెల్సీ అభ్యర్థి నెగ్గాలని కోరుకోకపోయినా.. ప్రజాస్వామ్యం ప్రకారం గెలవాలని కోరుకుంటున్నానని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.