Raghurama: టీడీపీ, జనసేన కలయిక ప్రభంజనం సృష్టిస్తుంది

ABN , First Publish Date - 2023-09-14T16:43:07+05:30 IST

న్యూఢిల్లీ: టీడీపీ, జనసేన కలయిక ప్రభంజనం సృష్టిస్తుందని, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే ముందుకు వెళ్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

Raghurama: టీడీపీ, జనసేన కలయిక ప్రభంజనం సృష్టిస్తుంది

న్యూఢిల్లీ: టీడీపీ, జనసేన కలయిక ప్రభంజనం సృష్టిస్తుందని, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే ముందుకు వెళ్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తాను ముందే చెప్పానని, పసుపు, ఎరుపు కలిస్తే కషాయం కలర్ వస్తుందన్నారు. జగన్‌కు ఇంకా ఆరు నెలలు మాత్రమే సమయం ఉందని పవన్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్బంగా గుర్తు చేశారు.

పనికిమాలిన నియంతల బూట్లు నాకుతున్న అధికారులు జైల్‌కు వెళ్ళడం ఖాయమని డీజీపీ స్థాయి అధికారి ప్రెస్ మీట్ పెట్టాలని.. రఘురామ రెడ్డి అనే అధికారి ఏ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారో చెప్పడం లేదని రఘురామ అన్నారు. 73 ఏళ్ల వయస్సు ఉన్న చంద్రబాబుకు ఇల్లు కంటే జైల్లో బాగుందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటున్నారని, నాలుగు రోజులు ఆగితే అన్నీ తెలుస్తాయని రఘురామ అన్నారు.

గతంలో తనను కూడా జైల్లో వేసి చంపాలని చూశారని రఘురామ అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ఫైల్ లేదని అంటున్నారని, మరి చంద్రబాబు 13సార్లు సంతకం ఎలా చేశారని చెబుతున్నారని ప్రశ్నించారు. అలాంటప్పుడు జైల్లో వేయాల్సింది అధికారులను కదా?.. చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో కూడా చేపట్టారన్నారు. కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారన్నారు. పీవీ రమేష్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చాలా క్లియర్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు. ఎన్ని కేసులు పెట్టిన చంద్రబాబుకు ఏమి కాదని, హైకోర్టులో ఆయనకు న్యాయం జరుగుతుందని రఘురామ ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-14T16:43:07+05:30 IST