Sajjala: చంద్రబాబు జైల్లో ఉండాలని ఎవరూ కోరుకోవడం లేదు..
ABN , First Publish Date - 2023-11-16T16:58:14+05:30 IST
అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రస్తుతం మెడికల్ బెయిల్‌పై ఉన్నారని, మరింత కాలం బెయిల్‌పై ఉండటానికి వీలుగా డాక్టర్లు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
అమరావతి: తెలుగుదేశం అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu) ప్రస్తుతం మెడికల్ బెయిల్‌పై ఉన్నారని, మరింత కాలం బెయిల్‌పై ఉండటానికి వీలుగా డాక్టర్లు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) విమర్శించారు. ఈ సందర్బంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలా వున్నారని, మెడికల్ రిపోర్టులు (Medical Reports) మాత్రం అనారోగ్యంగా వున్నట్లు ఇస్తున్నారని, చంద్రబాబుకు ఉన్న చర్మ వ్యాధులను ప్రాణాంతక వ్యాధిగా మెసేజ్ పపించారన్నారు.
చంద్రబాబు మెడికల్ బెయిల్‌పై ఉండి, రాజకీయాలు చేస్తున్నారని, బాబుకు మెడికల్ రిపోర్టులు ఇచ్చిన వారు డాక్టర్లా? లేక రాజకీయ పరమైన రిపోర్టులా? అని సజ్జల ప్రశ్నించారు. మెడికల్ రిపోర్టులపై చంద్రబాబు మేనేజ్‌మెంట్ కనిపిస్తోందన్నారు. బాబు చాక చక్యమా?... లేక డాక్టర్లు పరిధి దాటారా? అని అన్నారు. ఆయన జైల్లో ఉండాలని ఎవరు కోరుకోవడం లేదని, చంద్రబాబు పబ్లిక్ లైఫ్‌లోకి రావాలని కోరుకుంటున్నామన్నారు. ఆయన వ్యవస్థలను మేనేజ్ చేస్తారానడానికి మెడికల్ రిపోర్టులే ఉదాహరణ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.