Amaravathi Case: ఒక కేసు ఉండగా.. మరో కేసు ఎలా విచారిస్తారు?.. ఏపీ లాయర్లపై సుప్రీం ఆగ్రహం

ABN , First Publish Date - 2023-03-28T15:22:52+05:30 IST

ఏపీ న్యాయవాదులపై సుప్రీం కోర్టుకు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Amaravathi Case: ఒక కేసు ఉండగా.. మరో కేసు ఎలా విచారిస్తారు?.. ఏపీ లాయర్లపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ: ఏపీ న్యాయవాదుల (AP lawyers )పై సుప్రీం కోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. 8వ నెంబర్ కేసుపై విచారణ జరుగుతుండగా ధర్మాసనం ముందు అమరావతి కేసు (Amaravathi Case) ను ప్రస్తావించేందుకు ఏపీ న్యాయవాదులు ప్రయత్నించారు. దీంతో జస్టిస్ కేఎం జోసెఫ్ (Justice KM Joseph) అసహనం వ్యక్తం చేశారు. అమరావతి పిటీషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలని ఏపీ తరపు సీనియర్ న్యాయవాదులు నఫ్డే, నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. అయితే ఒక కేసు సగం విచారణలో ఉండగా... మరో కేసు ఎలా విచారించాలి అని న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఒక కేసు విచారణ పూర్తి కాకుండా... మరో కేసు విచారించడం తగదని అన్నారు. న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏపీ లాయర్లు మిన్నకుండిపోయారు.

కాగా.. సుప్రీం కోర్టులో కేసుల విచారణ జాబితా వరుస మారడంతో అమరావతి కేసుపై విచారణ ఆలస్యమైంది. మొదటి 5 కేసుల విచారణ తర్వాత 12వ నెంబర్ నుంచి 20 నెంబర్ కేసు వరకు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత 7వ నెంబర్ కేసు నుంచి 11వ నెంబర్ కేసు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత 21 నుంచి 39, 41వ నెంబర్ కేసులను కోర్టు విచారిస్తుంది. ప్రస్తుతం 10వ నెంబర్ కేసుగా అమరావతి రాజధాని కేసు ఉంది. అయితే ప్రస్తుతం 8వ నెంబర్ కేసుపై విచారణ జరుగుతున్న సమయంలో అమరావతి కేసును ప్రస్తావించేందుకు ఏపీ లాయర్లు యత్నించడంతో సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

Updated Date - 2023-03-28T15:28:37+05:30 IST