Krishna Dist.: మచిలీపట్నంలో మైనర్ బాలిక అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2023-04-21T17:07:28+05:30 IST

కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో మైనర్ బాలిక (Minor Girl) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అక్రమ సంబంధం కోసం బాలికను అడ్డు తొలగించారనే ఆరోపణలు వస్తున్నాయి.

Krishna Dist.: మచిలీపట్నంలో మైనర్ బాలిక అనుమానాస్పద మృతి

కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో మైనర్ బాలిక (Minor Girl) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అక్రమ సంబంధం కోసం బాలికను అడ్డు తొలగించారనే ఆరోపణలు వస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం, ఈడేపల్లిలో నివాసం ఉంటున్న గాంజాల పద్మ ఒంటరి మహిళ.. ఆమె తన 13 ఏళ్ల కుమార్తె గంజాల జూలీతో కలిసి నివాసం ఉంటుంది. శుక్రవారం ఉదయం జూలీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి పద్మ చెబుతోంది. బాలిక పడుకునే మంచం దగ్గర ఐరన్ పోల్ పడి ఉంది. దాంతో హతమార్చి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని స్థానికులు వ్యక్తం చేశారు. తల్లి, ఆమె ప్రియుడిని‌ విచారణ చేయాలని స్థానికులు కోరుతున్నారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-04-21T17:07:28+05:30 IST