MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన చంద్రబాబు
ABN , First Publish Date - 2023-03-23T12:34:26+05:30 IST
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అమరవాతి: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLA Cota MLC Elections) కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు వీల్ చెయిర్‌లో వచ్చి మరీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. డోలా బాలవీరాంజనేయస్వామి, నిమ్మలరామానాయుడు, అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఇలా తెలుగు దేశంకు చెందిన ఎమ్మెల్యేలు అంతా ఒకేసారి వచ్చి ఓటు వేశారు.
ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు 167 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా టీడీపీకి 23 మంది సభ్యుల బలం ఉంది. గెలుపొందేందుకు కేవలం 22 మంది సభ్యులుంటే సరిపోతుంది. అయితే తమకు బలం లేకపోయినా కూడా వైసీపీ అభ్యర్థిని బరిలో దింపడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. అలాగే టీడీపీ కూడా వ్యూహాత్మకంగా బీసీ మహిళను ఈ ఎన్నికల్లో నిలబెట్టింది. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణతో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది.
********************************************************************
ఇది కూడా చదవండి