Bachula Arjunudu పార్థివదేహానికి చంద్రబాబు నివాళి... అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

ABN , First Publish Date - 2023-03-03T12:53:26+05:30 IST

టీడీపీ సీనియర్ నేత బచ్చుల అర్జునుడు పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.

Bachula Arjunudu పార్థివదేహానికి చంద్రబాబు నివాళి... అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

అమరావతి: టీడీపీ సీనియర్ నేత బచ్చుల అర్జునుడు (TDP Leader Bachula Arjunudu) పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) నివాళులర్పించారు. శుక్రవారం బందరులోని బచ్చుల అర్జునుడు నివాసానికి చేరుకున్న టీడీపీ అధినేత... అర్జునుడికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం బచ్చుల అర్జునుడు అంతిమయాత్ర ప్రారంభమైంది. బచ్చుల అంతిమయాత్రలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు పాడె మోశారు. బందరులో ఎమ్మెల్సీ బచ్చుల అంత్యక్రియలు జరుగనున్నాయి. బచ్చుల అంతిమయాత్రలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కేశినేని నాని, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, కొనకళ్ల నారాయణ ఇతర తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో బచ్చుల అర్జనుడికి అంత్యక్రియలు జరుగనున్నాయి.

కాగా... జనవరి 28న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన బచ్చుల అర్జునుడు చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. అర్జునుడు మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.

Updated Date - 2023-03-03T12:54:15+05:30 IST