Atchannaidu: ప్రశ్నించే గొంతులను అణదొక్కేందుకే జీవో నెం.1

ABN , First Publish Date - 2023-01-03T11:42:06+05:30 IST

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణదొక్కేందుకే జీవో నెం.1 అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

Atchannaidu: ప్రశ్నించే గొంతులను అణదొక్కేందుకే జీవో నెం.1

అమరావతి: ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణదొక్కేందుకే జీవో నెం.1 అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వ వైఫల్యాలను పత్రికలు, మీడియా బయటపెడుతున్నాయనే కక్షతో జీవో నెం.2430‌ను తీసుకువచ్చారని మండిపడ్డారు. జగన్‌రెడ్డి ప్రభుత్వానికి పోగాలం దాపురించిందని, అందుకే ఈ నిరంకుశ నిర్ణయాలు తీసుకుంటోందని విరుచుకుపడ్డారు. ప్రజలు, పత్రికలు, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయకూడదనడం ప్రజాస్వామ్యాన్ని హరించడమే అని ఆయన తెలిపారు.

చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సభలకు వస్తున్న ప్రజల ప్రజాదరణ చూసి జగన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy)కి ఓటమి భయం పట్టుకుందన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలకు నిరసన తెలియజేసే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అవసరమైన భద్రత కల్పించకుండా ప్రజల ప్రాణాలు బలిగొంటున్నది జగన్‌రెడ్డి కాదా అని నిలదీశారు. నాడు జగన్‌రెడ్డి సభలు, పాదయాత్రకు టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే జగన్‌రెడ్డి ఇంట్లో నుంచి కాలు బయటపెట్టేవాడా అంటూ మండిపడ్డారు. అప్రజాస్వామికమైన జీవో నెం.1 ని వెంటనే రద్దు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-01-03T11:42:07+05:30 IST