Atchannaidu: మంత్రి అవినీతిని భయటపెడితే అక్రమ అరెస్ట్‌లు చేస్తారా?

ABN , First Publish Date - 2023-01-21T14:22:25+05:30 IST

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్‌లు చేసి ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Atchannaidu: మంత్రి అవినీతిని భయటపెడితే అక్రమ అరెస్ట్‌లు చేస్తారా?

అమరావతి: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్‌లు చేసి ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Atchannaidu) మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అనంతపురంలో మంత్రి ఉషశ్రీ చరణ్ (AP Minister Ushasree Charan) రిసార్టు నిర్మిస్తున్న ప్రాంత పరిశీలనకు టీడీపీ (TDP) పిలుపునిస్తే గృహనిర్బంధాలకు పాల్పడటం అమానుషమన్నారు. కళ్యాణ దుర్గాన్ని కబ్జాల నగరంగా మార్చారని విమర్శించారు. సాక్షాధారాలతో సహా మంత్రి అవినీతిని భయపెట్టిన టీడీపీ నాయకులను అక్రమ అరెస్ట్‌లు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలని ప్రశ్నించారు. అక్రమ అరెస్ట్‌లు చేయించారంటే తప్పు చేశారని ఒప్పుకున్నట్లేనా అని నిలదీశారు. ప్రజాధనాన్ని దోచుకునే హక్కు వైసీపీ నాయకుల (YCP Leaders)కు ఎవరిచ్చారన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వడం చేతగాదు కానీ... స్విమ్మింగ్ ఫూల్స్‌కు మాత్రం నీళ్లు ఇస్తారా అంటూ అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-01-21T14:22:26+05:30 IST