Devineni Uma: యువగళానికి స్ఫూర్తిగా పాదయాత్ర చేయనున్న దేవినేని
ABN , First Publish Date - 2023-05-13T13:18:42+05:30 IST
పట్టు వీడని మంచి సంకల్పంతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా: పట్టు వీడని మంచి సంకల్పంతో నారా లోకేష్ (Nara lokesh) పాదయాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Former Minister Devineni Umamaheshwar rao) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 15న వంద రోజులు పూర్తవుతుందని తెలిపారు. యువగళానికి స్ఫూర్తి ఇచ్చేందుకు మైలవరం పట్టణంలో తాను పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. పాదయాత్రలో పార్టీ నాయకులందరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 1 రద్దు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై ప్రతి పక్షాలు గొంతుఎత్తడం హక్కన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవాలి కానీ రాజారెడ్డి రాజ్యాంగం కాదని అన్నారు. జీవీరావుకు రాజశేఖర్ రెడ్డి సత్కారం చేశారని, జగన్ రెడ్డి పేపర్‌లో ఎన్నో ఆర్టికల్స్ రాశారని తెలిపారు. వాస్తవాలు చెబితే బహిరంగ సభలో వ్వక్తిత్వాలు దెబ్బతిసే విధంగా మాట్లాడటం సబబు కాదన్నారు.
ఎర్రిపప్ప అనడం తప్ప చేసిందేమీ లేదు..
లక్షలాది ఎకరాల్లో పంట దెబ్బతింటే వైసీపీ ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింటే జగన్ ప్రభుత్వానికి కానరావడం లేదన్నారు. మంత్రి పదవిలో ఉండి రైతులను పట్టుకొని ఎర్రిపప్ప అనడం, టీడీపీ నేతలను తిట్టే కార్యక్రమం తప్పితే రైతులకు ఎం చేసారో చెప్పే పరిస్థితి లేదని మండిపడ్డారు. మార్క్ ఫెడ్ రంగంలోకి వచ్చిందని చెప్పారని.. ఇప్పటి వరకు మొక్కజొన్నలు కొనలేదన్నారు. చంద్రబాబు మళ్ళీ వారం డెడ్ లైన్ పెట్టారని... దమ్ముంటే ప్రభుత్వం స్పందించాలని సవాల్ విసిరారు. ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడుకునే శ్రద్ధ ప్రజా సమస్యలపై జగన్ రెడ్డి పెట్టడం లేదని విమర్శించారు. రైతులను ఆదుకోవాలని రైతుల డిమాండ్ చేశారు.
జగన్ జైలుకెళ్లడం ఖాయం...
పోలవరంలో తాము చేసిన పనులకు కేంద్రం మొత్తం డబ్బులు చెల్లించింది. వైసీపీ ప్రభుత్వంలో చేసిన పనులకు ఎందుకు డబ్బులు తీసుకురాలేకపోతున్నావు జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ రెడ్డి చేసిన పాపలకు జగన్ రెడ్డి జైల్లో ఉంటారన్నారు. పోలవరం విషయంలో జగన్ రెడ్డి చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని.. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో జగన్ రెడ్డి మాటలు పచ్చి మోసమని మండిపడ్డారు. వర్షాలకు వరద వస్తే నిర్వాసితులు గుట్టలు, గట్లు ఎక్కి ప్రాణాలు కాపాడుకోవాల్సిందే అని అన్నారు. మైలవరం ఎమ్మెల్యే, వైసీపీ మంత్రులు, ఎంపీలు పంది కొక్కుల్ల వందల కోట్లు కొల్లగొట్టేశారని విమర్శించారు. ఎన్‌జీటీ ఆదేశాలు ఇచ్చిన గ్రావెల్ దందా ఆగడం లేదన్నారు. ఇసుక, మట్టి, మందు, గ్రానైట్‌ల ద్వారా లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. త్వరలో వీళ్ళ అవినీతి ని ప్రజలకు తెలియజేస్తామని దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు