Kollu Ravindra: అందుకే లోకేష్ పాదయాత్ర అంటే ప్రభుత్వానికి వణుకు..
ABN , First Publish Date - 2023-01-22T15:18:45+05:30 IST
కృష్ణా జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర (Kollu Ravindra) అన్నారు.
కృష్ణా జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర (Kollu Ravindra) అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాక్షస ప్రభుత్వంలో సమస్యలు ఎవరికీ చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని అన్నారు. యువత దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. అందుకే నారా లోకేష్ పాదయాత్ర అంటే ప్రభుత్వానికి వణుకు మొదలైందన్నారు.
లోకేష్ పాద యాత్ర ఆపాలని సీఎం జగన్ రెడ్డి (CM Jagan), డీజీపీ (DGP) కుట్ర చేస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసిన రాష్ట్ర ప్రజల సమస్యలపై లోకేష్ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఎప్పుడు లేని ఆంక్షలు లోకేష్ పాదయాత్రకు ఎందుకు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ‘నాడు మీరు చేసిన పాదయాత్రకు ఇవే ఆంక్షలు పెడితే పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం లోకేష్ చేస్తున్న యాత్రకు పోలీసులు చట్టపరంగా వ్యవహరించాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt.), జగన్ మోహన్ రెడ్డి మాటలు విని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఇబ్బందులు తప్పవని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.