Pattabhi: చంద్రబాబును మళ్లీ సీఎం పీఠంపై కూర్చోబెట్టే‌ వరకు వెనకడుగు‌ వేసేది లేదు...

ABN , First Publish Date - 2023-04-13T14:53:42+05:30 IST

కృష్ణా జిల్లా: తెలుగు వాళ్ల కీర్తిని దశ దిశలా వ్యాప్తి చేసిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్‌ (NTR) అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) అన్నారు.

Pattabhi: చంద్రబాబును మళ్లీ సీఎం పీఠంపై కూర్చోబెట్టే‌ వరకు వెనకడుగు‌ వేసేది లేదు...

కృష్ణా జిల్లా: తెలుగు వాళ్ల కీర్తిని దశ దిశలా వ్యాప్తి చేసిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్‌ (NTR) అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) అన్నారు. నిమ్మకూరులో చంద్రబాబు (Chandrababu) ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అన్నగారి స్వగ్రామంలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు (Centenary Celebrations) జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ చైతన్య రథంపై వస్తుంటే గంటల తరబడి నిరీక్షించి తాను‌ చిన్నప్పుడు చూసేవాడినని, స్కూల్ వార్షికోత్సవంలో ఎన్టీఆర్‌ వేషధారణతో ప్రదర్శనలు ఇచ్చే వాడినని అన్నారు. ఢిల్లీలో తెలుగు వాళ్ల సత్తా‌చూపిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌ అని.. మదరాసీలు కాదు తెలుగోళ్ల తెగింపు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చూపారని కొనియాడారు. ఢిల్లీ స్థాయి రాజకీయాలలో చక్రం తిప్పిన వ్యక్తులు ఎన్టీఆర్‌, చంద్రబాబులేనన్నారు. మళ్లీ సీఎం పీఠంపై‌ చంద్రబాబును కూర్చోబెట్టే‌ వరకు వెనకడుగు‌ వేసేది లేదని పట్టాభి స్పష్టం చేశారు.

మండలి బుద్ధప్రసాద్ (Mandali Buddhaprasad) మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, అమెరికా (America)లో, ఆస్ట్రేలియా (Australia)లో ‌పాల్గొన్నానని.. నిమ్మకూరులో పాల్గొన్న ఆనందం.. ఉద్వేగం ఎక్కడా ఉండదన్నారు. ఎన్టీఆర్‌ నడయాడిన నేల మనమంతా తిరగడం మనకి‌గొప్ప విషయమన్నారు. ఎన్టీఆర్‌‌ను స్పూర్తిగా తీసుకుని మనమంతా ముందుకు సాగాలని పిలుపిచ్చారు. తెలుగు జాతి.... మహోన్నత జాతిగా ప్రపంచ దేశాలకు ఎన్టీఆర్‌ చాటి‌చెప్పారన్నారు. భాషా పరంగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అని, తెలుగు దేశం పార్టీ కూడా మన భాష గుర్తు వచ్చేలా పెట్టారన్నారు.

ఇవాళ తెలుగు జాతికి అవమానకరమైన ఘటనలు ఎదరవుతున్నాయని, మెడలు‌ వంచుతామన్న మహా నాయకులే... ఢిల్లీ వెళ్లి మెడలు‌ వంచుతున్నారని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగు జాతిని ఢిల్లీ‌వెళ్లి తాకట్టు పెడుతున్నారని, మళ్లీ తెలుగు జాతికి గౌరవం ఉండాలంటే‌ చంద్రబాబు సీఎం కావాలన్నారు. రాజకీయంగా ఎన్టీఆర్‌‌ను తన తండ్రి విబేధించారని.. అయినా వారిద్దరి మధ్య మైత్రి బంధం చెక్కు చెదరలేదన్నారు. అధికార పార్టీ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోందని, అసలు ప్రజా స్వామ్యంలో ఉన్నామా? అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. రోజు రోజుకు దారుణాలు, దాష్టికాలు పెరిగి పోతున్నాయని, తెలుగు జాతి తల ఎత్తుకుని నిలబడాలంటే చంద్రబాబును సీఎం చేయాలని మండలి బుద్ధప్రసాద్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు పిలుపిచ్చారు.

Updated Date - 2023-04-13T14:53:42+05:30 IST