Pattabhiram: విచ్చలవిడిగా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు...

ABN , First Publish Date - 2023-04-11T11:25:10+05:30 IST

అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram).. జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Pattabhiram: విచ్చలవిడిగా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు...

అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram).. జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ భారాన్ని ప్రజలపై (People) మోపుతున్నారని, ఏపీఈఆర్సీ (APERC) చట్టంలో కొన్ని సవరణలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) ఇచ్చారన్నారు. చట్టాలను కూడా సవరించేసి గెజిట్ నోటిఫికేషన్లు ఇచ్చి బాదేస్తున్నారని. విచ్చలవిడిగా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని, వచ్చిన నష్టాన్ని వినియోగదారులపై మోపుతున్నారని మండిపడ్డారు.

రూ.3.082 కోట్ల వసూలుకు రంగం సిద్ధం చేసి ఛార్జీలు పెంచేశారని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఏ నెలకు ఆ నెల బాధాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఆదేశించారన్నారు. యూనిట్‌కు 40 పైసల చొప్పున వినియోగదారులపై అదనపు భారం పడుతోందన్నారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం రూ.5,500 కోట్ల భారం మోపుతున్నారని పట్టాభిరామ్ ఆరోపించారు.

Updated Date - 2023-04-11T11:25:10+05:30 IST