Yuvagalam Padayatra: లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా టీడీపీ నేతలు మేము సైతం అంటూ....
ABN , First Publish Date - 2023-05-15T10:20:16+05:30 IST
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో వంద రోజులు పూర్తి చేసుకోనుంది.
అమరావతి: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) నేటితో వంద రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. పాదయాత్రకు సంఘీభావంగా మేము సైతం అంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా పాదయాత్రలు చేపట్టారు. ప్రతి నియోజకవర్గంలో 3 వేల మంది పార్టీ శ్రేణులతో 7 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. సోమవారం ఉదయం నుంచే ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు సంఘీభావ యాత్రను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ యాత్రలో పాల్గొంటూ మద్దతు తెలుపుతున్నారు.
టీడీపీ నేతల పాదయాత్రలు ఇలా....
అనకాపల్లి: జిల్లాలోని చీడికాడ మండలం వరహపురంలో లోకేష్ యువగలం పాదయాత్రకు మద్దతుగా మాజీ టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు సుమారు 15 కిలోమీటర్లు పాదయాత్రను చేపట్టారు.
ప్రకాశం: నారా లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పామూరులో సంఘీభావ పాదయాత్ర మొదలైంది. పాదయాత్రలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
పల్నాడు: లోకేష్ యావగళం పాదయాత్రకు వినుకొండ నియోజకవర్గంలో సంఘీభావ యాత్ర చేపట్టారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీ.వీ.ఆంజనేయులు ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగుతోంది. భారీగా తెలుగు దేశం నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు.
అనంతపురం: రూరల్ మండల పరిధిలోని సజ్జల కాలువ నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత పాదయాత్ర ప్రారంభమయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అయితే పాదయాత్రలో డీజేకు అనుమతి లేదంటూ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.
విజయవాడ: లోకేష్ పాదయాత్ర వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర కొనసాగుతోంది. అశోక్ నగర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు పాదయాత్రను నిర్వహించారు. పాదయాత్రలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.
అనంతపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా కళ్యాణదుర్గం టీడీపీ ఇన్‌చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పాదయాత్ర చేపట్టారు. శెట్టూరు మండలం యాటకల్లు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉమమహేశ్వరరావు పాదయాత్రను ప్రారంభించారు. పది కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. కళ్యాణదుర్గం పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర కొనసాగనుంది.
కర్నూలు: ఆలూరు నియోజకవర్గంలో కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పాదయాత్ర చేస్తున్నారు. నారా లోకేష్ పాదయాత్ర 100 రోజులు 1250 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలూరు మండలం హత్తిబెలగల్ గ్రామం నుంచి ఆలూరు వరకు పాదయాత్ర చేయనున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
నంద్యాల: లోకేష్ పాదయాత్ర 100 రోజులు చేరుకున్న సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కడుమూరు నుంచి మిడుతూరు వరకు పాదయాత్ర చేపట్టారు.
కర్నూలు: నారా లోకేష్ యువగలం పాదయాత్ర 100 రోజులకు చేరుకున్న సందర్భంగా సంఘీభావం తెలుపుతూ మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామం నుంచి మంత్రాలయం వరకు టీడీపీ ఇంచార్జి తిక్కారెడ్డి పాదయాత్ర చేపట్టారు.
కర్నూలు: యువనేత లోకేష్ యువగళం 100 రోజుల పాదయాత్రకు సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఎమ్మిగనూరు టీడీపీ నాయకులతో కలసి అనంత పద్మనాభ దేవాలయం నుండి 8 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. ఎమ్మిగనూరు, నందవరం, గోనెగొండ్ల మండలాల నుంచి వేల సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు.
కర్నూలు: యువనేత లోకేష్ యువగళం 100 రోజుల పాదయాత్రకు సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఎమ్మిగనూరు టీడీపీ నాయకులతో కలసి అనంత పద్మనాభ దేవాలయం నుండి 8 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. ఎమ్మిగనూరు, నందవరం, గోనెగొండ్ల మండలాల నుంచి వేల సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు.
బాపట్ల: యువగళం పాదయాత్రకు సంఘీభావంగా మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గంలో సంఘీబాప యాత్ర చేపట్టారు. చుండూరు మండలం యడపల్లి నుంచి పాదయాత్ర సాగనుంది. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
అనంతపురం: లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పాదయాత్ర చేపట్టారు. నగరంలోని తపోవనం సర్కిల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు వైకుంఠ ప్రభాకర్ చౌదరి పాదయాత్ర చేశారు. పాదయాత్రలో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర చౌదరి మాట్లాడుతూ... 2024 ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతారన్నారు. నారా లోకేష్ పాదయాత్రకు ప్రజల్లో అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు.