Legislative Council: మండలిలో టీడీపీ సభ్యుల ఆందోళన.. రేపటికి వాయిదా..
ABN , First Publish Date - 2023-09-21T13:57:23+05:30 IST
అమరావతి: విరామం అనంతరం తిరిగి ఏపీ శాసనమండలి ప్రారంభమైంది. పలు బిల్లులు టేబుల్ చేస్తున్నట్టు ఛైర్మన్ ప్రకటించారు. దీంతో మళ్లీ టీడీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. పోడియంపైకి దూసుకువెళ్లి నిరసన తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించాలంటూ ఆందోళన చేశారు.
అమరావతి: విరామం అనంతరం తిరిగి ఏపీ శాసనమండలి (AP Legislative Council) ప్రారంభమైంది. పలు బిల్లులు టేబుల్ చేస్తున్నట్టు ఛైర్మన్ ప్రకటించారు. దీంతో మళ్లీ టీడీపీ ఎమ్మెల్సీలు (TDP MLCs) నినాదాలు చేశారు. పోడియంపైకి దూసుకువెళ్లి నిరసన తెలిపారు. చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టును ఖండించాలంటూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) జోక్యం చేసుకుంటూ పెద్దల సభలో ఛైర్మన్‌ను అగౌరవ పరుస్తూ వ్యవహరించడం దారుణమన్నారు. చంద్రబాబు ఎందుకు అరెస్టు అయ్యారు దానిపై చర్చించాలంటున్నారు.. దానిపై చర్చకు తాము సిద్దమని అన్నారు. చంద్రబాబుకు వ్యతిరేఖంగా మంత్రి మాట్లాడుతుండగానే వైసీపీ ఎమ్మెల్సీలు (YCP MLCs) నిరసన చేపట్టారు. చంద్రబాబు అవినీతిపై చర్చించడానికి తాము సిధ్దంగా ఉన్నామని, సొమ్ము వారికి ఎలా చేరిందో చెపుతామని మంత్రి అన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేఖంగా టీడీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని ఛైర్మన్ పోడియం వద్ద ప్రదర్శించారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో ఛైర్మన్ సభను శుక్రవారం నాటికి వాయిదా వేశారు.