Krishna Dist.: గన్నవరం నియోజకవర్గం ఆరుగోలనులో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2023-04-14T17:08:41+05:30 IST
గన్నవరం నియోజకవర్గం, ఆరుగోలను సెంటర్‌లో టెన్షన్ వాతావరణం (Tension Atmosphere) నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రాక కోసం టీడీపీ శ్రేణులు నిరీక్షిస్తున్నారు.
కృష్ణ జిల్లా: గన్నవరం నియోజకవర్గం, ఆరుగోలను సెంటర్‌లో టెన్షన్ వాతావరణం (Tension Atmosphere) నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రాక కోసం టీడీపీ శ్రేణులు నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ (YCP) జెండాతో ఓ కార్యకర్త (Activist) హల్ చల్ (Hal Chal) చేశాడు. దీంతో పోలీసులు వైసీపీ జెండా పట్టుకున్న కార్యకర్తను పక్కకు లాక్కెళ్లారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
టీడీపీ (TDP), వైసీపీ (YCP) శ్రేణుల మధ్య ఘర్షణ జరిగి.. పరస్పర దాడులు చేసుకున్నారు. పలువురికి గాయాలయ్యాయి. ఓ టీడీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. తలపగిలి రక్త శ్రావం జరిగింది. దీంతో వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.