AP Assembly: ప్రతిపక్ష సభ్యులవైపు దూసుకొచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు
ABN , First Publish Date - 2023-09-21T12:18:48+05:30 IST
అమరావతి: శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల వైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు దూసుకొచ్చారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి దూసుకు రావడంతో మంత్రి అంబటి రాంబాబు అడ్డుపడ్డారు. ఒక్కసారిగా వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నిలువరించారు.
అమరావతి: శాసనసభ (Assembly)లో ప్రతిపక్ష ఎమ్మెల్యేల వైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు (YCP MLAs) దూసుకొచ్చారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి (Madhusudhana Reddy) దూసుకు రావడంతో మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అడ్డుపడ్డారు. ఒక్కసారిగా వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి (MLA Srikanth Reddy) నిలువరించారు. దీంతో అధికార, ప్రతిపక్ష నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గందరగోళం మధ్య సభాపతి సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
ఈ సమయంలో బీఏసీ సమావేశానికి రావాలని అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ సుబ్బారాయుడు టీడీపీని ఆహ్వానించారు. ఈ భేటీకి తాము రాబోమని టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తమ నాయకుడు చంద్రబాబు అక్రమ అరెస్టుపై చర్చ తమ సింగిల్ పాయింట్ అజెండా అని టీడీపీ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు.